చరణ్ మహా రొమాంటిక్.. ఎంత నాటి ఫెలో అంటే.. ప్రెగ్నెన్సి టైం లోను ఉపాసనతో అలా.. !?

ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ..వెబ్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న రాంచరణ్ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఆయన నటించిన ఆర్ఆర్ఆర్ సినిమాకి ఆస్కార్ అవార్డు వరించినప్పటి నుంచి సోషల్ మీడియాలో రామ్ చరణ్ పేరు మహా వైరల్ గా మారింది. అంతేకాదు ఆయన భార్య ఉపాసన ప్రెగ్నెంట్ కావడంతో ఇద్దరికీ సంబంధించిన ఏదో ఒక వార్త రోజు వైరల్ అవుతూనే ఉంది . మొదట్లో సరోగసి ద్వారా పిల్లల్ని కంటున్నారని..ఆ తర్వాత అమెరికాలో బిడ్డకు జన్మనివ్వబోతున్నారని ..ఆ తర్వాత కవల పిల్లలు అని .. ఇలా నానారకాలుగా ఏదో ఒక వార్త ట్రెండ్ అవుతూనే ఉంది .

కాగా రీసెంట్గా చరణ్ చేసిన మరో పని సోషల్ మీడియాలో వైరల్ గా మారింది . ఉపాసనకు ప్రెసెంట్ 7 వ నెల రన్ అవుతుంది . మరి రెండు నెలలు కంప్లీట్ అవ్వగానే ఉపాసన చేతుల్లో పండు లాంటి పాప కానీ బాబు కానీ ఉంటారు . ఈ క్రమంలోనే చరణ్ ఆ స్పెషల్ మూమెంట్ కోసం చాలా ఎక్సైట్ మెంట్ గా వెయిట్ చేస్తున్నారట. అంతేకాదు ఉపాసన ఉన్న బేబీ తో ఇప్పటినుంచే మాట్లాడుతున్నారట . ఆమె బేబీ కిక్ ఫీలింగ్స్ ని చాలా ఎంజాయ్ చేస్తున్నాడట . అంతే కాదు నిద్రలో కూడా బేబీ ఎప్పుడు కిక్ చేస్తాడా అంటూ వెయిట్ చేస్తూ ఉన్నారట..

దీంతో చరణ్ తన బేబీ కోసం ఎంత ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు అంటూ ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. అంతేకాదు ప్రెగ్నెన్సీ టైంలోనూ ఉపాసన చేత జిమ్ వర్కౌట్ చేయిస్తున్నారట . మార్నింగ్ యోగా ..వాకింగ్ ఫాలో అవుతూ ఉపాసన హెల్త్ ని కడుపులోని బేబీ హెల్త్ జాగ్రత్తగా కాపాడుతూ వస్తున్నాడట. అంతేకాదు ఉపాసనన్ని మధ్య మధ్యలో నవ్వించడానికి జోక్స్ వేస్తూ ఆమెకి స్వయమైన చరణ్ వంట చేసి పెడుతూ వస్తున్నారట. దీంతో కడుపుతో ఉన్న భార్యని చూసుకునే విధానం ఇది అంటూ అమ్మాయిలు ఓ రెంజ్ లు చరణ్ పొగడేస్తున్నారు . మరో పక్క చరణ్ మహా రొమాంటిక్ వైఫ్ ని ఎంత కేర్ఫుల్ గా చూసుకుంటున్నాడు.. వెరీ నాటీ ఫెలో అంటూ రకరకాల కామెంట్స్ తో ట్రెండ్ చేస్తున్నారు. చరణ్ ని ఓ రేంజ్ లో పొగిడేస్తున్నారు మెగా ఫాన్స్ . ఏది ఏమైనా సరే చరణ్ స్టార్ హీరోనే కాదు భర్త గా కూడా సూపర్ సక్సెస్ అయ్యాడని అంటున్నారు మెగా ఫ్యాన్స్..!!

Share post:

Latest