తలరాత అంటే ఇదే.. దాదాపు 22 ఏళ్ళ తరువాత మళ్ళీ అలాంటి పనిచేస్తున్న కీరవాణి..!!

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్న ఎంఎం కీరవాణి పేరు చెప్తే అందరికీ అదో తెలియని కొత్త ఫీలింగ్ కలుగుతుంది . తను పని చేసే ప్రతి సినిమాకి సరికొత్తగా మ్యూజిక్ ఇస్తూ ఇప్పటికి క్రియేట్ చేస్తూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు ఎం ఎం కీరవాణి. రీసెంట్ గానే ఇండియన్ హిస్టరీలో ఎవరు సాధించని ఆస్కార్ అవార్డు అందుకొని తెలుగు చలనచిత్ర పరిశ్రమ పేరును ప్రపంచవ్యాప్తంగా మారుమ్రోగిపోయేలా చేశారు . ఎం ఎం కీరవాణి ఆర్ఆర్ఆర్ సినిమాలో గాను నాటునాటు పాటకి ఆస్కార్ అవార్డు వరించిన సంగతి తెలిసిందే .

ఆస్కార్ వేదికపై కూడా కీరవాణి తనదైన స్టైల్ లో పాట పాడి జనాలను మెప్పించాడు . కాగా రీసెంట్గా కీరవాణికి సంబంధించిన ఓ న్యూస్ వైరల్ గా మారింది . దాదాపు 22 ఏళ్ల తర్వాత కీరవాణి మళ్లీ తమిళ్లో మ్యూజిక్ చేయబోతున్నాడు . రజనీకాంత్ హీరోగా 2005 లో వచ్చిన హారర్ మూవీ చంద్రముఖికి సీక్వెల్ చేస్తున్న విషయం తెలిసిందే. 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ తెరకెక్కిస్తూ ఉండడంతో సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు అభిమానులు .

ఈ క్రమంలోనే రాఘవ లారెన్స్ హీరోగా బాలీవుడ్ భామ కంగనా రనౌట్ చంద్రముఖి పాత్రలో ఈ సినిమాలో మెప్పించబోతుంది . సినిమాకి సంబంధించిన ఆల్మోస్ట్ ఆల్ షూటింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది అంటూ సమాచారం అందుతుంది . చంద్రముఖి సినిమా డైరెక్టర్ చ పి వాసునే ఈ సినిమాని కూడా డైరెక్ట్ చేశాడు . తాజాగా ఈ మూవీ షూటింగ్ గురించి అప్డేట్ ఇచ్చాడు దర్శకుడు ..చిత్రీకరణ చివరి దశకు వచ్చిందని ..ఇంకో పది రోజుల్లో షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుందని చెప్పుకొచ్చారు . అంతేకాదు త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ కూడా ప్రకటిస్తారట. ఈ సినిమాకి సంగీతం ఇస్తున్న కీరవాణి దాదాపు 22 ఏళ్ల తర్వాత తమిళంలో డైరెక్ట్ గా మ్యూజిక్ ఇవ్వబోతున్నారు . దీంతో ఫాన్స్ ఫుల్ ఈగర్ గా ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు..!!

Share post:

Latest