హై వోల్టేజ్ యాక్షన్ తో అదరగొట్టేస్తున్న నిఖిల్ స్పై టీజర్..!!

కార్తికేయ సినిమాతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయి విజయాన్ని అందుకున్న నిఖిల్ సిద్ధార్థ్ ఇప్పుడు మరో డిఫరెంట్ యాక్షన్ మూవీలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కార్తికేయ 2 సినిమాతోనే పాన్ ఇండియా హీరో అయిపోయిన ఈయన ఇప్పుడు పాన్ ఇండియా చిత్రం స్పై మూవీ తో సరికొత్త సంచలనం సృష్టించడానికి సిద్ధమయ్యాడు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క రహస్యాలను ఆధారంగా తీసుకొని ఈ సినిమా టీజర్ ను తాజాగా విడుదల చేయడం జరిగింది. ఇకపోతే ఈ స్పై టీజర్ ను ఢిల్లీలోని చారిత్రాత్మక ప్రదేశం అయిన ఐకానిక్ ల్యాండ్ మార్క్ కర్తవ్య పాత్ (రాజ్ పాత్) వద్ద భారీ స్థాయిలో వేదికను ఏర్పాటు చేసి దీనిని విడుదల చేశారు.

ఇకపోతే ప్రముఖ ఎడిటర్ గ్యారీ బిహెచ్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని ఎడ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కే రాజశేఖర్ రెడ్డి అలాగే చరణ్ తేజ ఉప్పలపాటి సినిమాను నిర్మిస్తున్నారు. టీజర్ లోని ఈ సినిమాలో నిఖిల్ ఒక స్పైగా కనిపించబోతున్నట్లు మనకు ముందుగానే క్లారిటీ ఇవ్వడం జరిగింది. అతను ఒక సుభాష్ చంద్రబోస్ మిస్టర్ ని ఎలా చేదించాడు అనేది ఈ సినిమా కథాంశంగా తెలుస్తోంది. ఇకపోతే మిస్ అయిన ఒక ఫైల్ ఇప్పుడు ఎక్కడ ఉంది.. ఆ ఫైల్ వెనుక ఉన్న రహస్యం ఏమిటి అనే విషయాలను తెలుసుకునే సమయంలో సుభాష్ చంద్రబోస్ ఒక విమాన ప్రమాదంలో చనిపోయినట్లుగా వస్తున్న వార్తల్లో నిజం ఎంత అనే విషయాలను ఇందులో చూపించబోతున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు మకరంద దేశ్పాండే కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. అలాగే కమెడియన్ అభినవ్ కూడా స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నట్లు సమాచారం. ఎపిసోడ్స్ కూడా ఈ టీజర్ లో చాలా అద్భుతంగా ఉన్నాయి మొత్తానికైతే ఈ టీజర్ తోనే ప్రేక్షకులను అలరిస్తున్నాడు నిఖిల్ ఇందులో ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తోంది.

Share post:

Latest