చీరలు బాగోలేవని.. “సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు” సినిమా లో సీత పాత్ర వదులుకున్న ఆ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా..?

మరుగున పడిపోతున్న మల్టీస్టారర్ మూవీకి నాంది పలికింది “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమా అని చెప్పాలి . టాలీవుడ్ సీనియర్ హీరోగా పేరు సంపాదించుకున్న వెంకటేష్ సూపర్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న మహేష్ బాబు కలిసి నటించిన సినిమాని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు . 11 జనవరి 2013 న థియేటర్స్ లో గ్రాండ్గా రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో హ్యూజ్ బ్లాక్ బస్టర్ హిట్గా బాక్సాఫీస్ వద్ద నిలిచింది . అంతే కాదు ఈ సినిమాలో హీరోయిన్ గా సమంత-అంజలి నటించారు.

ఈ సినిమాలో ప్రధానోపాత్రలో ప్రకాష్ రాజ్ .. రావు రమేష్ నటించారు . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం పెట్టిన దానికి డబుల్ లాభాలు తీసుకొచ్చి నిర్మాత దిల్ రాజుకు ప్రాఫిట్స్ తీసుకొచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . నిజానికి ఈ సినిమా ద్వారానే తెలుగులో అంజలి పాపులారిటీ సంపాదించుకుంది . అయితే అంజలి పాత్రకు ఈ సినిమాలో మొదట అనుకున్న హీరోయిన్ నయనతార అంటూ ప్రచారం జరుగుతుంది.

స్టోరీ వినగానే శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమాకు సీత పాత్రలో నయనతార బాగుంటుంది అంటూ సజెస్ట్ చేశారట . దిల్ రాజు కూడా ఓకే చేశారట. ఇదే విషయాన్ని నయనతారకు వివరించారట . కథ బాగా నచ్చిన రెమ్యూనరేషన్ బాగున్న సరే నయనతార రిజెక్ట్ చేసింది . దానికి కారణం ఈ సినిమాలో సీత పాత్ర అంత ఎఫెక్టివ్ గా లేకపోవడం ..పైగా కాస్ట్యూమ్‌స్ పరంగా కూడా సీత మిడిల్ క్లాస్ లో ఉండడం ఆమెకు అస్సలు నచ్చలేదట . కొంచెం ట్రెండీ శారీలు ప్రిఫర్ చేస్తే బాగుంటుంది అంటూ డైరెక్టర్లకి సజెస్ట్ చేసిందట .

ఈ క్రమంలోనే నయనతార మరీ ఓవర్ చేస్తుంది అన్న కారణంతో దిల్ రాజు ఈ సినిమా నుంచి ఆమెను తప్పించి మరో హీరోయిన్ కోసం ట్రై చేశారట . చాలామంది ముద్దుగుమ్మలని అప్రోచ్ అయ్యి ఆఖరికి అంజలిని సెలెక్ట్ చేశారట.ఏ మాటకు ఆ మాటే ఈ పాత్రలో సీత పాత్రలో అంజలి తప్పిస్తే మరి ఏ హీరోయిన్ సూట్ కాదు అన్నంత విధంగా నటించేసింది అంజలి . ఈ సినిమా హిట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ కూడా అంజలి అంటూ చెప్పకు వచ్చారు జనాలు. అలా చీరలు నచ్చని కారణంగా ఏకంగా బ్లాక్ బస్టర్ ని వదులుకునింది నయనతార అంటూ అప్పట్లో హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేశారు జనాలు..!!

 

Share post:

Latest