ఒకప్పుడు స్టార్ హీరోయిన్ల సైతం వివాహం చేసుకొని సెటిల్ అవుతున్నారు. అలాంటివారిలో ప్రభాస్ నటించిన మిర్చి సినిమాలో హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ కూడా ఒకరు.. మిరపకాయ, మిర్చి , నాగవల్లి వంటి బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన ఈమె ఎంతో మంది హీరోలతో నటించింది. ఈమె నటించింది తక్కువ సినిమాలే అయినా తెలుగు ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయే పాత్రలలో నటించింది. తన చిన్ననాటి స్నేహితుడిని వివాహం చేసుకొని విదేశాలలో సెటిల్ అయింది. వీరికి ఒక బాబు కూడా ఉన్నారు.
తాజాగా రీచా గంగోపాధ్యాయ తన కొడుకుతో కలిసి దిగిన కొన్ని ఫోటోలను షేర్ చేయడం జరిగింది. మాతృ దినోత్సవం సందర్భంగా తన కొడుకు ఫోటోలను ఆమె షేర్ చేసింది. తన కొడుకు పుట్టినప్పటినుంచి ప్రస్తుతం ఎలా ఉన్నారో తెలియజేస్తూ అన్ని ఫోటోలను సైతం షేర్ చేస్తూ తన కొడుకుతో ఉండడం తనకు చాలా ఆనందంగా ఉంది అంటూ తెలియజేస్తోంది ఈ అమ్మడు. ఇమే తల్లిగా మారి 2 సంవత్సరాలవుతోంది..కానీ జీవితంలో తల్లి కావడం చాలా గొప్ప అనుభూతి అంటూ తెలియజేస్తోంది.
ప్రస్తుతం తన కొడుకుతో తన భర్త తాను ఊహించని దానికంటే ఎక్కువ ఆనందాన్ని పొందుతున్నట్లు తెలియజేస్తోంది. మదర్స్ డే సందర్భంగా ఆమె షేర్ చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి .ఢిల్లీ ప్రాంతానికి చెందిన ఈ ముద్దుగుమ్మ విదేశాలలో చదువుకుంది. అమెరికాలో ఉంటూ అక్కడే మిస్ ఇండియా పోటీల్లో విజయం సాధించడంతో 2007లో మిస్ ఇండియా UAS కిరీటాన్ని అందుకుంది. ఆ తర్వాత సినిమాలలోకి ఎంట్రీ ఇచ్చిన రీఛా మొదటిసారి లీడర్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
View this post on Instagram