పెళ్లికి రెడీ అయిన మరో యంగ్ హీరోయిన్.. క్రేజీ పోస్ట్ వైరల్..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్ సెలబ్రిటీలు అందరూ ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకుని లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు. మరి ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన బడా బడా హీరోయిన్స్ ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్స్ అందరూ కూడా పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైపోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే టాలీవుడ్ ఇండస్ట్రీలో పలువురు స్టార్ సెలబ్రిటీస్ పెళ్లిపీటలు ఎక్కి తమ లైఫ్ కి సంబంధించిన గుడ్ న్యూస్ లని సైతం వినిపించేశారు .

కాగా అదే లిస్టులో కి యాడ్ అయిపోతుంది యంగ్ బ్యూటీగా పేరు సంపాదించుకున్న హెబ్బా పటేల్ అంటూ ఓ న్యుస్ వైరల్ అవుతుంది. దానికి కారణం లేకపోనూ లేదు . అమ్మడు తన సోషల్ మీడియా ఖాతాలో “నా పెళ్లికూతురు ఫంక్షన్ కి స్వాగతం “అంటూ పోస్ట్ పెట్టూకొచ్చింది. ఈ క్రమంలోని హెబ్బా పటేల్ పెళ్లి చేసుకోబోతుంది అన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్న సరే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టలేకపోయినా హెబ్బా పటేల్ తనదైన స్టైల్ లో మాత్రం అరాకొరా అవకాశాలు అందుకుంటుంది.

ఇలాంటి క్రమంలోనే నిజంగానే అమ్మడు పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిలైపోవాలని అనుకుంటుందా ..?అందుకే ఇలాంటి పోస్ట్ పెట్టిందా..? అంటూ జనాలు చెప్పుకొస్తుంటే ..మరి కొందరు ఇది కేవలం సినిమాకి సంబంధించిన పోస్ట్ అయ్యి ఉంటుందని,, ఈ మధ్యకాలంలో ప్రమోషన్స్ కోసం హీరోయిన్స్ ఈ విధంగా కూడా పోస్ట్లు పెట్టకు వస్తున్నారు అని చెప్పుకొస్తున్నారు . ఏది ఏమైన హెబ్బా పటేల్ అనుకున్నది సాధించింది ..పెళ్లి చేసుకుంటుందో లేదో తెలియదు.. కానీ పోస్ట్ మాత్రం వైరల్ అయిపోతుంది..!!