తెలుగు సినీ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎంతో మంది స్టార్ హీరోలు సైతం ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలలో నటిస్తూ ఉంటే మహేష్ బాబు కూడా తనదైన స్టైల్ లో సినిమాలను తెరకెక్కిస్తే దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. మహేష్ బాబు రెండు దశాబ్దాల సినీ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నారు. అప్పటికి ఇప్పటికీ అదే అందంతో అభిమానులను ఆకట్టుకుంటూనే ఉన్నారు.
ఫ్యామిలీ ఆడియన్స్ ను మాస్ ఆడియన్స్ను కూడా మెప్పిస్తూ ఉంటారు మహేష్ బాబు. ఒకవైపు సినిమాలలోనే కాకుండా మరొకవైపు బిజినెస్లలో కూడా పెట్టుబడులు పెట్టి పలు రకాలుగా సంపాదిస్తూనే ఉన్నారు. తాజాగా మహేష్ బాబు రెమ్యూనరేషన్ పెంచినట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న ప్రస్తుత చిత్రం కోసం రూ.70 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రాబోతున్న చిత్రానికి ఏకంగా రూ.110 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ప్రభాస్, అల్లు అర్జున్ తర్వాత టాలీవుడ్ నుంచి రూ .100 కోట్ల క్లబ్ లో చేరిన మహేష్ బాబు హీరోగా మహేష్ బాబు పేరు పొందారు. మహేష్ బాబు నటించిన సినిమాలకు జస్ట్ హిట్ టాక్ వస్తే చాలు కొన్ని కోట్ల రూపాయలు కలెక్షన్లు రాబడుతుంది.ఇక సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రాజమౌళితో సినిమా తర్వాత మహేష్ ఏ స్థాయిలో రేంజ్ పెరుగుతుందో ఊహించడం కష్టం.