ద్యావుడా..ఆఖరికి విజయ్ దేవరకొండ కూడానా..? ఏం పిచ్చి రా బాబు..!!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో యంగ్ బ్యూటీ శ్రీలీల పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . సినిమా ఎలాంటిదైనా స్టార్ కాదు ..పాన్ ఇండియా స్టార్ కాదు ..గ్లోబల్ స్టార్ కాదు.. శ్రీలీల ఉండాల్సిందే . ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న ఆల్మోస్ట్ అన్ని బడా ప్రాజెక్ట్స్ లో శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది . బాలకృష్ణ -మహేష్ బాబు -ప్రభాస్ -రామ్ చరణ్ -ఎన్టీఆర్-పవన్ కళ్యాణ్ ఇలా అందరి సరసన సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉంది.

కాగా ఇలాంటి క్రమంలోనే టాలీవుడ్ యంగ్ హీరో గా పేరు సంపాదించుకున్న విజయ్ దేవరకొండ సినిమాలో కూడా హీరోయిన్ గా సెలెక్ట్ అయింది . దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది . ప్రస్తుతం విజయ్ దేవరకొండ శివ నిర్వాణ డైరెక్షన్లో “ఖుషి” అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా సమంత నటిస్తుంది . కాగా తాజాగా మరో సినిమాని కూడా ప్రారంభించాడు విజయ్ దేవరకొండ .

గౌతమ్ తిన్నురి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ ఓ సినిమా కమిట్ అయ్యాడు. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీ లీల నటిస్తుంది. ఈరోజే ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు మొదలుపెట్టారు . దీనికి సంబంధించిన పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . కాగా ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పవర్ ఫుల్ పోలీస్ ఆఫిసర్ పాత్రలో నటించబోతున్నట్లు తెలుస్తుంది . కాగా ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ లాంటి స్టార్ హీరో కూడా తన సినిమాలో శ్రీ లీలాని పెట్టుకున్నాడా..? అంటూ జనాలు ఆశ్చర్యపోతున్నారు . చూడాలి మరి వీళ్లిద్దరి కాంబో తెరపై ఎలా వర్క్ అవుట్ అవుతుందో..?

Share post:

Latest