శరత్ బాబు ఆరోగ్యం పై క్లారిటీ ఇచ్చిన సోదరి..!!

ప్రముఖ నటుడు శరత్ బాబు ఆరోగ్యం పైన నిన్నటి రోజు నుంచి సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ గా మారుతున్నాయి. సినీ ప్రముఖులు శరత్ బాబు అభిమానులు ఆ విషయాలను విని ఆందోళన గురి అవ్వడం జరిగింది. కానీ శరత్ బాబు సన్నిహితుల వర్గాల నుంచి మాత్రం ఈ పుకార్లను కొట్టివేస్తూ త్వరగా కోలుకొని శరత్ బాబు మన మధ్యకు వస్తారని తెలియజేయడం జరిగింది.. తాజాగా శరత్ బాబు సోదరి కూడా శరత్ బాబు పై వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది.

శరత్ బాబు ఆరోగ్యం గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ కూడా ఆ వాస్తవం.. ఆయన ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని అతని ప్రస్తుతం ఉంటున్న గదిని మార్చినట్లుగా ఆమె తెలియజేసింది. ఆయన పూర్తిగా కోలుకోవాలని త్వరలోనే మీడియాతో మాట్లాడగలరని ఆమె తెలియజేస్తోంది. సోషల్ మీడియాలో వచ్చేటువంటి ఎలాంటి వార్తలనైనా అసలు నమ్మవద్దని శరత్ బాబు గారు త్వరగా కోలుకొని రావాలని ప్రార్థించమని ప్రజలను కోరింది. ప్రస్తుతం శరత్ బాబు గారి వయస్సు 71 సంవత్సరాలు.

హైదరాబాదులోని AIG హాస్పటల్లో చేరేన ఈయన వైద్యులు ఎప్పటికప్పుడు ఆయన ఆరోగ్యం పై జాగ్రత్తలు తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. చాలా కాలంగా స్కిన్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న శరత్ బాబు వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్నట్లు గడిచిన కొద్ది రోజుల క్రితం తెలియజేయడం జరిగింది. ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఊపిరితిత్తులు మరికొన్ని అవయవాలు దెబ్బ తినడంతో చికిత్స పొందుతున్నారు. శరత్ బాబు ఇప్పటికీ 220 కు పైగ చిత్రాలలో నటించారు. శరత్ బాబు ఆరోగ్యం పై వస్తున్న వార్తలపై ఎట్టకేలకు తన సోదరి క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.

Share post:

Latest