HBD: త్రిష ఈ స్థాయిలో ఉండడానికి కారణం ఆ సినిమానేనా..?

హీరోయిన్ త్రిష 40వ పుట్టినరోజు 2002లో మొదటిసారిగా హీరోయిన్గా మౌనం పెసియాదే అనే తమిళ సినిమా ద్వారా మొదటిసారిగా ఈమె ఇండస్ట్రీకి పరిచయమైంది. తెలుగు సినీ ఇండస్ట్రీకి మాత్రం తరుణ్ తో నటించిన నీ మనసు నాకు తెలుసు అనే చిత్రం ద్వారా పరిచయమయ్యింది. కానీ త్రిష కెరియర్ను మార్చినది మాత్రం ప్రభాస్ నటించిన వర్షం సినిమా అని చెప్పవచ్చు. ఈ సినిమా తోనే మొదటిసారిగా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకున్నది. త్రిష కెరియర్ మొత్తం మీద ఇప్పటికి 70కుపైగా సినిమాలలో నటించింది.
Happy Birthday Trisha Krishnan: Wishes pour in for '96' actress from  Khushbu, Aishwarya Rajesh, and others | Regional-cinema News – India TV
త్రిష ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 20 ఏళ్లకు పైగా అవుతోంది. ఈ మధ్యకాలంలో ఏ హీరోయిన్ అయినా కూడా 5 లేదా 6ళ్లకు మించి కెరియర్ ని పెద్దగా కొనసాగలేక పోతున్నారు అని చెప్పవచ్చు. త్రిష మాత్రం 20 ఏళ్లకు పైగా సినిమాలలోనే హీరోయిన్గా నటిస్తూ బిజీగా ఉంటుంది ఇప్పటికీ ఈమె చేతులు నాలుగైదు సినిమాలు ఉన్నాయి. పలు లేడి ఓరియంటెడ్ చిత్రాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంటుంది త్రిష. ఈమె కేవలం తెలుగు లోనే కాకుండా తమిళ్ ,కన్నడ ,మలయాళం వంటి సినిమాలలో కూడా నటిస్తూ బిజీగా ఉంది.
ఒకానొక సమయంలో త్రిష కెరియర్ అయిపోయింది అన్నట్టుగా వార్తలు వినిపించాయి.. 2016లో దాదాపుగా నాలుగు సినిమాలలో నటించిన త్రిష 2017లో ఒక్క సినిమాలో కూడా నటించలేదు. దీంతో ఈమె కెరియర్ ఒక్కసారిగా డౌన్ అయిపోయింది. అప్పటికె వివాహం చేసుకోవాలని ఫిక్స్ అయిన ఈమె.. కానీ ఆమె పెళ్లి బ్రేక్ చేసి మళ్లీ సినిమాలలో నటించింది. ఈసారి మళ్లీ ఒక విభిన్నమైన సినిమా 96 మూవీతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఈ చిత్రాన్ని జాను అనే పేరుతో విడుదల చేశారు. ఈ చిత్రం విడుదలైన ప్రతి చోట మంచి విజయాన్ని అందుకుంది దీంతో ఈ అమ్మడు కెరియర్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మంచి విజయాలను అందుకుంటోంది.