బాబు అరెస్ట్..అంతకు రెండింతలు ఉంటుంది.?

చంద్రబాబు అరెస్ట్ అవుతారు? జైలుకు వెళ్తారు? అమరావతిలో భూముల స్కామ్..స్కిల్ స్కామ్..అబ్బో ఇలా ఒకటి చాలా స్కామ్‌లు గత టి‌డి‌పి హయాంలో జరిగాయి..వాటి అన్నిటిని బయటపెట్టి బాబుని జైల్లో పెడతామని గత నాలుగేళ్లుగా వైసీపీ చెబుతూనే ఉంది. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని, జగన్ మాదిరిగా 43 వేల కోట్లు తినలేదని, జైలుకు వెళ్లలేదని, నిజాయితీగా ఉన్నానని, ఈ నాలుగేళ్ళల్లో ఏం పీకలేకపోయారని, ఇంకా ఏడాదిలో ఏం చేస్తారని, ఇప్పటివరకు తనపై పెట్టని కేసు లేదని, ఇంకా సిట్ విచారణతో ఏం చేస్తారని తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

అమరావతి భూముల్లో స్కామ్ జరిగిందని దానిపై జగన్ ప్రభుత్వం సిట్ విచారణ వేసిన విషయం తెలిసిందే. దీనిపై హైకోర్టు స్టే విధించింది. కానీ తాజాగా ఆ స్టేని సుప్రీం కోర్టు ఎత్తేసింది. దీంతో బాబు అక్రమాలు తేలుస్తామని, ఆయన్ని జైల్లో పెడతామని వైసీపీ నేతలు సవాల్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నేతలకు బాబు కౌంటర్ ఇచ్చారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసుకొన్న నిర్ణయాలపై అనేక కేసులు పెట్టారని,  ఆ కేసుల్లో చాలామందిని తీసుకొచ్చి లాకప్‌లో పెట్టి తన పేరు, లోకేశ్‌ పేరు చెప్పాలని హింసించారని, తాము క్లీన్‌గా ఉన్నంతకాలం మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరని, నాలుగేళ్లు అయిపోయింది…ఇంకేం చేయగలుగుతారు? అని బాబు ఫైర్ అయ్యారు.

అయినా జగనే పెద్ద అవినీతిపరుడు. ఆయన తనని అనేది ఏమిటి? జగన్ రూ.43వేల కోట్ల ప్రజాధనం దోచారని సీబీఐ కేసులు పెట్టిందని, షెల్‌ కంపెనీలకు డబ్బులు వచ్చాయని, తమ పార్టీలో ఎవరికైనా వచ్చాయా? జగన్ టీవీ, పేపర్లు, సిమెంట్‌ కంపెనీలకు డబ్బులు ఎక్కడినుంచి వచ్చాయి? అని ప్రశ్నించారు. జగన్‌కు ఇవి చివరి రోజులు అని, అయినా సైకో మారడని, దిగిపోయిన తర్వాత దీనికి రెండింతలు ఉంటుందని, ఆ పార్టీ దీనికి సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు.

Share post:

Latest