అన్ని ఉన్న రాశి కి ఆ ఒక్కటే తక్కువ..అందుకే తెలుగు హీరోలు ఆఫర్లు ఇవ్వట్లేదా..?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా రావాలి అన్నా.. వచ్చిన తర్వాత ఆ అవకాశాలు అలాగే కంటిన్యూ అవ్వాలి అన్నా.. ఆ పేరు పదికాలాలపాటు చల్లగా ఉండాలి అన్నా హీరోయిన్స్ చాలా కేర్ఫుల్ గా ఉండాలి . కేవలం అందం విషయంలోనే కాదు నటన విషయంలో.. వాక్చాతుర్యం విషయంలో ..ఆచితూచి నిర్ణయాలు తీసుకొని ఆలోచించి మాట్లాడాలి . ఏమాత్రం పొరపాటు జరిగిన సరే అడ్రస్ లేకుండా పోతారు . అయితే అలాంటి ఓ చిన్న పొరపాటు చేసి స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించుకున్న రాశి ఖన్నా తెలుగు ఇండస్ట్రీలో డిజాస్టర్ హీరోయిన్గా మారిపోయింది .

రాశి ఖన్నా పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ” ఊహలు గుసగుసలాడే” అనే సినిమా ద్వారా తన అందాలను తెలుగు జనాలకు పరిచయం చేసిన ఈ ముద్దుగుమ్మ ..ఆ తర్వాత బోలెడన్ని సినిమాల్లో నటించింది . హిట్లు కూడా అందుకుంది .బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందుకొని హిట్లు సంపాదించింది . అయినా సరే రాశిఖన్నా పేరుకు పెద్దగా క్రేజ్ దక్కలేదు. మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో అమ్మడి పేరు ఈ మధ్యకాలంలో విపరీతంగా డి గ్రేడ్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు జనాలు . దానికి కారణం రాశిఖన్నా ఆ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో సౌత్ ఇండస్ట్రీపై చేసిన కామెంట్స్.

” సౌత్ ఇండస్ట్రీలో తన నటనకు ప్రాధాన్యం దక్కే పాత్రలు ఇవ్వలేదని ..బాలీవుడ్లో అలాంటి రోల్స్ ఇచ్చారని.. సౌత్లో కేవలం హీరోయిన్ గ్లామరస్ పరంగానే చూస్తారని ..అదే బాలీవుడ్లో నటిగా గుర్తిస్తారు “అని చెప్పుకొచ్చింది . దీంతో తెలుగులో అసలు అవకాశాలు ఇవ్వకుండా చేసేసారు డైరెక్టర్లు. అంతేకాదు తెలుగు జనాలు ఇప్పుడు ఆమె పేరునే పట్టించుకోవడం లేదు . ఈ క్రమంలోనే తెలుగు స్టార్లు కూడా అమ్మడుతో రొమాన్స్ చేయడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు . దీంతో రాశీ ఖన్నా వచ్చిన ఆఫర్స్ తో సరిపెట్టుకోవడమే బెటర్ అంటున్నారు జనాలు..!!

Share post:

Latest