హీరోయిన్ హనీ రోజ్ ని టార్గెట్ చేసిన ఆ స్టార్ హీరో ఎవరు?

హనీ రోజ్… నిన్న మొన్నటివరకు మన తెలుగువారికి తెలియదు గానీ, ఈ ఏడాది జనవరిలో బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ సినిమాతో ఈమె తెలుగువారికి బాగా పరిచయం అయ్యింది. ఈ మలయాళ బ్యూటీ ఆ సినిమాలో చాలా కీలక పాత్రలో నటించి మెప్పించింది. తెలుగులో అంతకు ముందు రెండు సినిమాలు చేసినా కానీ హనీ రోజ్ కి అంతగా గుర్తింపు రాలేదు అని చెప్పుకోవాలి. కానీ వీర సింహారెడ్డి సినిమాలో చేసిన పాత్రతో ఒక్కసారిగా విపరీతమైన క్రేజ్ లభించింది.

ఇక ఈ సినిమా హిట్ అవ్వడానికి బాలయ్య ఒక రీజన్ అయితే సెకండ్ రీజన్ హనీ రోజ్ మరో కారణం. శృతిహాసన్ లాంటి హీరోయిన్ ఉన్నప్పటికీ అందరు హనీ రోజ్ పాత్రనే ఎక్కువగా లైక్ చేయడం జరిగింది. ఈ మలయాళ బ్యూటీ అందాలకు.. తెలుగు కుర్ర కారు అయితే ఫిదా అయిపోయింది. సినిమా రిలీజ్ అవ్వకముందే కాదు ఆఖరికి “వీర సింహారెడ్డి” ఫ్రీ రిలీజ్ వేడుకలో.. హనీ రోజ్ చాలా హైలెట్ గా నిలిచి, మనవాళ్లకు గిలిగింతలు పెట్టిందని చెప్పుకోవచ్చు.

దాంతో హనీ రోజ్ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో బాగానే వినబడుతోంది. చాలామంది హీరోలు ఆమెనే కావాలని పట్టుబడుతున్నట్టు తెలుస్తోంది. ఇండస్ట్రీలో ఓ ప్రముఖ బడా హీరో కూడా తన సినిమాలో ఐటమ్ సాంగ్ చేయాలని మంకు పట్టు బట్టి మరీ ఆమె డేట్స్ బుక్ చేసుకున్నాడట. కాగా ఆమెను ఆ బడా హీరో టార్గెట్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. రెమ్యూనరేషన్ ఎంతైనా పర్వాలేదు ఆమె చేతే ఐటమ్ సాంగ్ చేయించాలని ఆ టాప్ హీరో పంతం మీద ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. మరి ఈ మలయాళ బ్యూటీ ఆ సాంగ్ చేస్తుందో లేదో చూడాలి. ఆ హీరో ఎవరు త్వరలో మీకే తెలుస్తుంది.

Share post:

Latest