NTR -31 చిత్రం నుంచి అదిరిపోయే అప్డేట్..!!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో దేవర సినిమా తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ చిత్రం మే 19వ తేదీన ఫస్ట్ లుక్ పోస్టర్ తో రివిల్ చేయడం జరిగింది. ఇందులో ఎన్టీఆర్ ఊర మాస్ లుక్ లో కనిపించబోతున్నారు. హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తోంది విలన్ గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తూ ఉన్నారు. ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే ఎన్టీఆర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయబోతున్నారు.ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ తెలియజేయడం జరిగింది.

Team NTR 31 Drops A Special Announcement Poster And Wishes The Young Tiger  On This Special Occasion
కే జి ఎఫ్ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద పైన సంచలనాలను సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నిల్ , ఎన్టీఆర్ చేయబోయే సినిమా పైన ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం పై కలిసి నిర్మిస్తూ ఉన్నారు. ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా తన 31వ ప్రాజెక్టు రెగ్యులర్ షూటింగ్ వచ్చే యేడాది నుంచి మొదలు కాబోతున్నట్లు తెలియజేయడం జరిగింది. ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వరుస అప్డేట్లు రావడంతో అభిమానులు తెగ ఖుషి అవుతున్నారు.

ఈ సినిమానే కాకుండా బాలీవుడ్ లో కూడా ఒక సినిమాలో నటించబోతున్నట్లు హృతిక్ రోషన్ తన ట్విట్టర్ నుంచి ఎన్టీఆర్కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పోస్టుని షేర్ చేశారు. మీతో యుద్ధభూమిలో నిలవడానికి ఎదురుచూస్తున్నాను అంటూ క్యాప్షన్ రాసుకురావడం జరిగింది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ నెగటివ్ షేర్లు కనిపించబోతున్నట్లు సమాచారం. మరి బాలీవుడ్ లో ఏ మేరకు ఎన్టీఆర్ తన హవా కొనసాగిస్తారో చూడాలి మరి. ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రపంచమంతా ఉందని చెప్పవచ్చు.

https://twitter.com/MythriOfficial/status/1659812599205335041?s=20