బాల‌య్య వ‌ల్లే రామ్ చ‌ర‌ణ్ స్టార్ హీరో అయ్యాడ‌ని మీకు తెలుసా?

నట‌సింహం నందమూరి బాలకృష్ణ వ‌ల్లే మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ స్టార్ హీరో అయ్యాడా అంటే అవున‌నే చెప్పాలి. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. బాల‌య్య ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో నటించారు.. నటిస్తూనే ఉన్నారు. అలాగే బాలకృష్ణ తన సినీ కెరీర్ లో ఎన్నో సినిమాల‌ను రిజెక్ట్ చేశారు. ఈ జాబితాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను స్టార్ హీరోగా నిల‌బెట్టిన ఇండ‌స్ట్రీ హిట్ మూవీ కూడా ఉంది.

 

అదే ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన `మగధీర`. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జంటగా కాజల్ అగర్వాల్ నటించగా.. అల్లు అరవింద్ ఈ సినిమాను ఎంతో గ్రాండ్గా నిర్మించారు. శ్రీహరి, శరత్ బాబు వంటి వారు కీలక పాత్రలో నటించిన ఈ సినిమా 2009లో విడుదలై బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డ్లను సృష్టించి రామ్ చరణ్ సినీ కెరియర్ లోనే ఓ మైలిరాయిగా మిగిలిపోయింది.

 

ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నిర్మాతకు కాసుల వర్షం కురిపించింది. ఈ సినిమా ఆ రోజుల్లోనే ఏకంగా రూ.75కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించి.. అప్పుడు వ‌ర‌కు టాలీవుడ్ లో ఉన్న అన్ని రికార్డులను తిరగరాసింది. అంతేకాకుండా ఈ సినిమా ధియేటర్లో 1000 రోజులు ఆడి మరో ఘనతను అందుకుంది. నిజానికి ఈ మగధీర సినిమాను ముందుగా బాలకృష్ణతో చేయాలని రాజమౌళి భావించారట.

అదే క్రమంలో బాలయ్య వద్దకు వెళ్లి ఈ సినిమా కథను కూడా చెప్పారట.. అయితే ఈ సినిమా కథ బాలయ్యకు ఎంతగానో ఆకట్టుకున్నా..కొన్ని అనుకోని కారణాలవల్ల ఈ సినిమాను బాలయ్య సున్నితంగా తిర‌స్క‌రించారని తెలుస్తుంది. ఆ తర్వాత మగధీర కథను రామ్ చరణ్ తో తీసి రాజామౌళి ఎలాంటి రికార్డులు సృష్టించారో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతోనే రామ్ చ‌ర‌ణ్ ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోగా నిల‌దొక్కుకున్నాడు. అలా మొత్తానికి చ‌ర‌ణ్ స్టార్ హీరో అవ్వ‌డానికి ప‌రోక్షంగా బాల‌య్య‌నే కార‌ణం అయ్యాడు.