బర్తడే రోజున కొత్త సినిమా ప్రకటించిన అల్లు శిరీష్.. సక్సెస్ అయ్యేనా..?

అల్లు కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చిన హీరోలలో అల్లు అర్జున్ తో పాటు అల్లు శిరీష్ కూడా ఒకరు. అల్లు అర్జున్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకోగా అల్లు శిరీష్ మాత్రం ఇంకా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. తన అన్న బాటలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను అలరిస్తున్నారు అల్లు శిరీష్.. మొదట గౌరవం అనే సినిమా ద్వారా హీరోగా పరిచయమైన ఈ నటుడు ఆ తర్వాత ఎన్ని సినిమాలు చేసిన ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నారు. ఆ తర్వాత శ్రీరస్తు శుభమస్తు అనే సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు.

Allu Sirish co star surprises all | cinejosh.com

ఆ తర్వాత పలు చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సిరీస్ ఆ మధ్య చిన్న గ్యాప్ తీసుకొని ఊర్వశివో రాక్షసివో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.ఇప్పుడు తాజాగా తన బర్తడే సందర్భంగా ఈరోజు తన సినిమాకు సంబంధించి ఒక విషయాన్ని తెలియజేయడం జరిగింది. అల్లు శిరీష్ ఇండస్ట్రీకి వచ్చి దాదాపుగా పదేళ్లు అవుతున్న ఇప్పటివరకు ఏడు సినిమాలలో మాత్రమే నటించారు.

ఇప్పుడు మరొక సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు కోస్టార్ టెడ్డీబేర్ తో మైక్రో ట్రైన్ లో ఉన్న ఒక పోస్టర్ని షేర్ చేస్తూ తన నెక్స్ట్ సినిమా గురించి అనౌన్స్మెంట్ చేశారు.ఈరోజు సాయంత్రం ఈ సినిమా నుంచి అప్డేట్ రాబోతున్నట్లు సమాచారం. ఇంతకీ ఈ సినిమా డైరెక్టర్ ఎవరు ఈ సినిమా ఎలా ఉండబోతోంది ఈ సినిమాతో నైనా అల్లు శిరీష్ సక్సెస్ అందుకుంటారా అనే అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Allu Sirish (@allusirish)