అల్లు అర్జున్ ఫ‌స్ట్ గ‌ర్ల్‌ఫ్రెండ్ పేరేంటో తెలుసా.. స్నేహా మాత్రం కాదండోయ్‌!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప 2` సినిమా చేస్తున్న‌ సంగ‌తి తెలిసిందే. ఫ‌స్ట్ పార్ట్ `పుష్ప ది రైజ్‌` సంచ‌ల‌న విజ‌యాన్ని న‌మోదు చేయ‌డంతో.. రెండు భాగం `పుష్ప ది రూల్‌`ను అంత‌కు మించి అనేలా తెర‌కెక్కిస్తున్నారు. ఈ సంగ‌తి ప‌క్క‌న పెడితే.. ప్రముఖ ఓటీటీ ఆహాలో ప్రసారమవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఫైనల్స్ కు చేరుకుంది.

ఫైన‌ల్ ఎపిసోడ్ కు గెస్ట్ గా అల్లు అర్జున్ వ‌చ్చాడు. ఫైనల్ ఎపిసోడ్స్ లో మొత్తం అల్లు అర్జున్ సాంగ్స్ పాడి అదరగొట్టబోతున్నారు. తాజాగా ఫైన‌ల్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇందులో అల్లు అర్జున్ త‌న ఫ‌స్ట్ గర్ల‌ఫ్రెండ్ పేరేంటో రివీల్ చేశారు. అయితే అల్లు అర్జున్ స్నేహా రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. మొద‌ట ఇరు కుటుంబ‌స‌భ్యులు పెళ్లికి ఒప్పుకోక‌పోయినా.. ఫైన‌ల్ గా అల్లు అర్జున్‌, స్నేహాల ప్రేమ‌ను అర్థం చేసుకుని వైభ‌వంగా వివాహం చేశారు.

కానీ, అల్లు అర్జున్ ఫ‌స్ట్ గ‌ర్ల్‌ఫ్రెండ్ మాత్రం స్నేహా రెడ్డి కాదండోయ్‌. తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 ఫైనల్ కి వచ్చిన కంటెస్టెంట్స్ లో శ్రుతి అనే అమ్మాయి ఉంది. శ్రుతి సాంగ్ పాడిన అనంత‌రం ఆమెతో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. `నీ పేరు అంటే నాకు చాలా ఇష్టం. నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరు కూడా శ్రుతినే` అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు షో మొత్తంలో అల్లు అర్జున్ శ్రుతి పేరుని తీసుకు వస్తూనే ఉన్నాడు. దీంతో షో మొత్తం ఫుల్ ఎంటర్టైన్ గా జరిగింది. దీంతో నెటిజ‌న్లు అల్లు అర్జున్ ఫ‌స్ట్ గ‌ర్ల్‌ఫ్రెండ్ అయిన ఆ శ్రుతి ఎవ‌రా అని ఆరాలు తీయ‌డం మొద‌లు పెట్టారు.