ఐపీఎస్ అధికారితో వివాదం.. బ‌ట్ట‌బ‌య‌లు అయిన‌ డింపుల్ బాగోతం!

ప్ర‌ముఖ హీరోయిన్ డింపుల్ హ‌యాతి పేరు నిన్న‌టి నుంచి వార్త‌ల్లో మారుమోగిపోతోంది. డింపుల్‌ హయతీ, ఆమె బాయ్ ఫ్రెండ్‌ విక్టర్‌ డేవిడ్‌పై హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. జూబ్లీహిల్స్‌ జర్నలిస్టు కాలనీలోని హుడా ఎన్‌క్లేవ్‌లో నటి డింపుల్ హయాతి, విక్ట‌ర్ డేవిడ్ తో పాటు ఐపీఎస్ అధికారి, ట్రాఫిక్ డీసీపీ రాహుల్‌ హెగ్డే నివాసం ఉంటున్నారు.

పార్కింగ్‌ విషయంలో డింపుల్‌, రాహుల్ హెగ్డే మధ్య చాలా రోజుల నుంచి వివాదం జ‌రుగుతోంది. అయితే రాహుల్ హెగ్డే వాహనాన్ని హీరోయిన్ డింపుల్‌ హయాతి ధ్వంసం చేసినట్లు, డీసీపీ డ్రైవర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఐపీఎస్ అధికారితో డింపుల్ వివాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ కేసుపై డింపుల్‌ హయాతి తరఫు న్యాయవాది పాల్ సత్యనారాయణ.. డీసీపీ రాహుల్ హెగ్డే ఉద్దేశపూర్వకంగా డింపుల్ ను వేధించేందుకే కేసు పెట్టించార‌ని ఆరోపించారు.

ఇక‌పోతే ఈ వివాదం కార‌ణంగా డింపుల్ సీక్రెట్ బాగోతం బ‌ట్ట‌య‌లు అయింది. ప్ర‌స్తుతం విక్టర్‌ డేవిడ్ అనే వ్య‌క్తితో డింపుల్ ఒకే ఇంట్లో ఉంటూ స‌హ‌జీవ‌నం చేస్తుంద‌న్న విషయం ఈ సంద‌ర్భంగా బయటపడింది. డింపుల్ హయాతిపై ఇప్పుడు వ‌ర‌కు ఎలాంటి ఎఫైర్ వార్తలు రాలేదు. కానీ, డేవిడ్ విక్టర్ అనే వ్యక్తితో కలిసి జీవిస్తున్న సంగతి వెలుగులోకి రావ‌డంతో అభిమానులు ఒకింత షాక‌వుతున్నారు.

Share post:

Latest