సినీ హీరో అబ్బాస్ జీవితంలో కూడా ఇన్ని ఒడిదుడుకులా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో అమ్మాయిల కలల రాకుమారుడుగా పేరుపొందారు హీరో అబ్బాస్. అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్డం అందుకున్న అబ్బాస్ అంతలోనే ఇండస్ట్రీకి దూరమయ్యారు.. అయితే అలా ఇండస్ట్రీ నుంచి బయటికి వచ్చిన తర్వాత అబ్బాస్ బైక్ మెకానిక్ గా కూడా పనిచేశారు. దీంతో ఇండియాని వదిలి విదేశాలలో సెటిల్ అయ్యారని వార్తలు వినిపిస్తూ ఉంటాయి. ఈయన పూర్తి పేరు మీర్జా అబ్బాస్ అలీ. కోల్కత్తా కు చెందిన అబ్బాస్ టీనేజ్ లోనే మోడలింగ్ వైపు అడుగులు వేశారు.

Actor Abbas Childhood & Family | Wife & Daughter, Son | Rare and Unseen  Family | ExtraZoom - YouTube
అలా అతి తక్కువ సమయంలోనే తమిల్, తెలుగు, మలయాళం, హిందీ , కన్నడ వంటి భాషలలో నటించారు 1996లో ప్రేమదేశం అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన అబ్బాస్ మొదటి సినిమాతోనే మంచి పాపులారిటీ సంపాదించారు.. అయితే అలా కొద్ది రోజులకు న్యూజిలాండ్ లో బైక్ మెకానిక్ గా కూడా పనిచేశారు. కోలీవుడ్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న అబ్బాస్ కొంతకాలం పెట్రోల్ బంకులో కూడా పనిచేశారని సమాచారం ప్రస్తుతం ఈయన వయసు 45 సంవత్సరాలు. కానీ అబ్బాస్ మాత్రం ఇప్పటివరకు ఏం చేస్తున్నారనే విషయం తెలియడం లేదు..

కానీ అందుతున్న సమాచారం ప్రకారం అబ్బాస్ వ్యక్తిగత జీవితంలో ఎదురైన కొన్ని ఒడిదుడుకుల కారణం చేత ఒకసారి ఆత్మహత్య చేసుకోవాలని ఆలోచన కూడా వచ్చిందని గతంలో తెలియజేశారు. అయితే ప్రస్తుతం ఆత్మహత్యలపట్ల మొగ్గు చూపుతున్న పిల్లల మనసులు మార్చే విధానం పై ప్రజలను అవగాహన తీసుకువచ్చే అందుకే తాను ఆస్ట్రేలియాలో వెళ్లి పబ్లిక్ స్పీకింగ్ సర్టిఫికెట్ కోర్సును చేశారని అబ్బాస్ తెలిపారు. అబ్బాస్ భార్య కూడా ఒక డిజైనర్.. ముఖ్యంగా ఆమె పెళ్లి దుస్తులను డిజైన్ చేస్తూ ఉంటుంది. 2000 సంవత్సరంలో అబ్బాస్ తన ఫ్యామిలీతో కలిసి విదేశాలకు వెళ్లి అక్కడే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ గా సెటిల్ అయ్యాడని సమాచారం.

Share post:

Latest