న‌రేష్ లో నాకు న‌చ్చేది అదే.. నాలో అది లేదంటూ ప‌విత్ర బోల్డ్ కామెంట్స్‌!

టాలీవుడ్ లో బోల్డ్ కపుల్ గా పేరు తెచ్చుకున్న నరేష్, పవిత్ర కలిసి `మళ్లీ పెళ్లి` అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఎం ఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ కృష్ణ మూవీస్ బ్యానర్ పై నరేష్ స్వయంగా నిర్మించారు. మే 26న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పవిత్ర తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన విశేషాలే కాకుండా వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంది. అంద‌రూ అనుకుంటున్న‌ట్లు మ‌ళ్లీ పెళ్లి సినిమా బయోపిక్ కాద‌ని.. ఈ కథ సమాజానికి అద్దం పడుతుంద‌ని.. ప్రేక్ష‌కుల‌కు తప్పకుండా కనెక్ట్ అవుతార‌ని ప‌విత్ర తెలిపింది.

ఇక ఈ క్రమంలోనే న‌రేష్ లో తనకు బాగా నచ్చే క్వాలిటీని రివీల్‌ చేసింది. `నరేష్ గారు ఎంత సీరియస్ విషయాన్ని అయినా చాలా లైట్ తీసుకొని.. దానికి ఏం కావాలో చాలా సీరియస్ గా చేస్తారు. ఆ క్యాలిటీ నాకు చాలా ఇష్టం. అది నాలో లేదు. నేను చిన్న చిన్న విషయాలని కూడా సీరియస్ గా తీసుకుంటాను. కానీ, న‌రేష్ గారు అందుకు భిన్నం. ఈ రోజు తమకి ఉన్నదాంట్లో సంతోషంగా వుండాలని అనుకుంటారు. ఇక అన్నిటికన్నా న‌న్ను ఎంతో జాగ్ర‌త్త‌గా చూసుకుంటారు` అంటూ ప‌విత్ర చెప్పుకొచ్చింది. దీంతో ఈమె కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.

Share post:

Latest