ఆ విషయంలో పవన్ మరదలు తొందర పడిందా..? కొంచెం ఆపుకుని ఉంటే దశ తిరిగిపోయేదా..?

సినిమా ఇండస్ట్రీలో కి హీరోయిన్గా రావాలి అని.. వచ్చిన తర్వాత తమ బొమ్మను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవాలి అని .. ఎంతో మంది ముద్దుగుమ్మలకు ఆశగా ఉంటుంది . అయితే అందరూ ఆ కష్టాన్ని ..ఆ టార్చర్ ని భరించలేరు.. అలా భరించిన వారందరూ కూడా సినిమా ఇండస్ట్రిలో స్టార్ పొజిషన్ కి వెళ్ళారా..? అంటే నో అని చెప్పాలి . ఆ లిస్టులోకే వస్తుంది అందాల ముద్దుగుమ్మ ప్రణతి . ఇలా చెప్తే జనాలు గుర్తుపట్టలేరు. అదే పవన్ మరదలు అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు .

అంతలా తన ఒరిజినల్ పేరు కన్నా సినిమాలో చేసిన పాత్ర పేరుతోనే పాపులారిటీ సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. “ఏం పిల్లో ఏం పిల్లడో ” అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ప్రణతి .. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో అవకాశాలు దక్కించుకుంది . అయితే ఎందుకో అమ్మడు ఖాతాలో పెద్దగా హిట్లు పడలేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అత్తారింటికి దారేది సినిమాతో ఫస్ట్ హిట్ తన ఖాతాలో వేసుకున్న ప్రణతి..

ఆ తర్వాత పలు అవకాశాలు వచ్చినా.. సినిమాలు చేసినా.. హిట్ హీరోయిన్గా మారలేకపోయింది. ఈ క్రమంలోనే ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిలైపోయినా ప్రణతి .. ఆ తర్వాత ఒక పాపకి కూడా జన్మనిచ్చింది. కాగా రీసెంట్ కాలంలో ప్రణతి సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తుంది. ఈ ఫొటోస్ చూసిన జనాలు “తొందరపడి పెళ్లి చేసుకున్నావ్ ప్రణతి.. కొంచెం ఆగుంటే నీకు మంచి అవకాశాలు వచ్చుండేవి.. ఇప్పుడు నువ్వు ఎంత హాట్ అందాల వలక బోసిన పిల్ల తల్లి గానే చూస్తారు కానీ పిల్లగా చూడరు..” అంటూ కామెంట్స్ చేస్తున్నారు . దీంతో ప్రణతి తాజాగా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ గా మారాయి..!!

 

Share post:

Latest