అప్పుడు బన్నీ.. ఇప్పుడు చిరంజీవి.. ఈ హీరోయిన్ మాటలు వింటే షాక్ అవ్వాల్సిందే.. స్పాట్ లోనే దోశ భలే తిరగేసిందే..!!

సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం హీరోయిన్స్ ఎంత బోల్డ్ గా మాట్లాడుతున్నారో.. ఎంత బోల్డ్ గా కంటెంట్ ప్రదర్శిస్తున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్స్ ఇప్పుడిప్పుడే మళ్ళీ కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్న హీరోయిన్స్ .. హద్దులు మీరి నటించడానికి కూడా సిద్ధపడుతున్నారు . ఎటువంటి రోల్స్ నైనా యాక్సెప్ట్ చేస్తున్నారు . అదే లిస్ట్ లోకి యాడ్ అయిపోయింది ప్రియమణి అంటూ సోషల్ మీడియాలో హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు .

మనకు తెలిసిందే ప్రియమణి కెరియర్ స్టార్టింగ్ లో ఎలాంటి సినిమాల్లోనటించిందో . ఇండస్ట్రీని షేక్ చేసి పడేసింది . కాగా కెరియర్ లో తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా కొంతకాలం సినిమా ఇండస్ట్రీకి బ్రేక్ వేసిన ప్రియమణి మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . ప్రెసెంట్ ప్రియమణి సినిమాలతో వెబ్ సిరీస్ లతో ఫుల్ గా బిజీ బిజీగా ఉంది . ఈ క్రమంలోనే ఆమె లేటెస్ట్ గా నటించిన సినిమా కస్టడి. ఈ సినిమాలో కీ రోల్ లో నటించబోతుంది ప్రియమణి . ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆధారంగా సినిమాలో సూపర్ డూపర్ హిట్ రోల్ చేయబోతుంది ప్రియమణి అంటూ అందరికీ అర్థం అయిపోయింది.

సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో స్టేజిపై మాట్లాడుతూ..” ప్రియమణి నేను ఆల్మోస్ట్ ఆల్ అందరి హీరోలతో నటించానని.. కానీ చిరంజీవి గారితో నటించాలన్న నా కోరిక అక్కడే ఆగిపోయిందని .. ఒక్క ఛాన్స్ ఇస్తే ఆ కోరిక కూడా తీర్చేసుకుంటాను ” అంటూ మనసులోని మాట బయట పెట్టింది . అయితే అంతకుముందు జడ్జిగా చేస్తున్నప్పుడు బన్నీ గెస్ట్ గా వచ్చిన ఎపిసోడ్ కి ఇలానే చెప్పింది . బన్నీతో నటించాలని ఉందని ఓపెన్గా అడిగేసింది . ఈ క్రమంలోని ప్రియమణి ఎవరి ముందు వాళ్ళ మాట మాట్లాడుతుందని అప్పుడేమో బన్నీ ఫేవరెట్ అంటే.. ఇప్పుడేమో చిరంజీవి ఫేవరెట్ అంటూ దోశను భళే తిరగేసిందని ఆమెను ట్రోల్ చేస్తున్నారు . దీంతో ప్రియమణి మాటలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి..!!

Share post:

Latest