సాయి పల్లవి లో ఉన్న ఏకైక నెగిటివ్ పాయింట్ ఇదే.. అదే ఆమె కొంప ముంచుతుందా..?

సినిమా ఇండస్ట్రీలో ఎంతమంది బ్యూటీ లు ఉన్నా.. హీరోయిన్ సాయి పల్లవికి ఉన్న ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు . ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ టైంలోనే లేడీ పవర్ స్టార్ అంటూ ట్యాగ్ చేయించుకున్న సాయి పల్లవి .. నేడు తన పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంది . ఎస్ సాయి పల్లవి 9 మే 1992న జన్మించింది . ఈరోజు సాయి పల్లవి పుట్టినరోజు. సాయి పల్లవి బర్త డే ను పురస్కరించుకొని సాయి పల్లవి ఫాన్స్ ఆమెకు స్పెషల్ విషెస్ ను అందజేస్తున్నారు. మైనస్లను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు .

సాయి పల్లవిలో నెగిటివ్ పాయింట్ లేనేలేదు అంటూ జనాలు ఇప్పటివరకు చెప్పుకొచ్చేవాళ్లు. అయితే ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెలో ఉన్న నెగిటివిటీ.. నెగిటివ్ పాయింట్ ఇదే అని ..అదే ఆమె పాజిటివ్ పాయింట్ కూడా అంటూ జనాలు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. కాగా కథ విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటుందో సాయి పల్లవి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . లిప్ లాక్ లు – రొమాంటిక్ సీన్స్ – వల్గర్ సీన్స్ ఉంటే చచ్చినా చేయదు. అలాంటి ఓ గిరిగిసి పెట్టుకున్న సాయి పల్లవి కి అదే నెగటివ్ పాయింట్ అంటూ కూడా జనాలు చెప్పుకొస్తున్నారు.

ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చాక కొన్ని కొన్ని సార్లు రూల్స్ బ్రేక్ చేయాలి.. హద్దులు దాటాలి ..అప్పుడే ఇండస్ట్రీలో ఆమెకున్న టాలెంట్ ని ప్రూవ్ చేసే డైరెక్టర్ ఆమె వద్దకు వస్తారు . హీరోయిన్స్ అంటే కేవలం పద్ధతిగా ఉంటేనే సరిపోదు.. కొన్ని కొన్ని సార్లు హెల్తి రొమాన్స్ కూడా చేయాలి. ఒకప్పటి హీరోయిన్స్ కూడా పద్ధతిగా ఉండేవారు .. కానీ అడపాదడప హెల్తీ రొమాన్స్ చేసే వాళ్ళు.. అయితే సాయి పల్లవి అలాంటి రొమాన్స్ సీన్స్ లో కూడా చేయను అంటూ మొండిగా కూర్చోవడం ఆమెకే నెగిటివ్గా మారింది అంటున్నారు జనాలు. అంతేకాదు సాయి పల్లవికి ఉన్న మొండితనమే ఆమె కు నెగెటివిటీ అని .. అదే ఆమె పాజిటివ్ అని చెప్పుకొస్తున్నారు . కొన్ని కొన్ని సార్లు అదే ఆమె కొంప ముంచుతుంది అంటూ కూడా జనాలు ఆమెకు సజిస్ట్ చేస్తున్నారు. చూద్దాం ఈ బర్తడే నుంచి అయినా సాయి పల్లవి తన రూల్స్ బ్రేక్ చేస్తుందో లేదో..?

 

Share post:

Latest