“నేను ఎవరికి ద్రోహం చేశానో చెప్పడానికి ..నేను ఎక్కడ ఉన్నానో నాకు తెలియదు”.. విజయ్ దేవరకొండ నెవర్‌ బిఫోర్‌ అవతార్ వైరల్‌..!!

నేడు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ పుట్టినరోజు . తన పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు విజయ్ దేవరకొండ. ఈ క్రమంలోనే సోషల్ మీడియా వ్యాప్తంగా విజయ్ దేవరకొండకు హ్యూజ్ రేంజ్ లో బర్త డే విషెస్ ని అందజేస్తున్నారు ఫ్యాన్స్ . అంతేకాదు సినీ ఇండస్ట్రీలో ఉండే ప్రముఖులు ఆయన జాన్ జిగిడి దోస్తులు అందరు సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండకు స్పెషల్గా విష్ చేస్తూ.. ఆయనపై ఉన్న ప్రేమను తెలియజేస్తున్నారు . ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఖుషి సినిమాకి సంబంధించిన ఫస్ట్ సింగిల్ ను నేడు రిలీజ్ చేశారు మేకర్స్.

ఈ పాట రొమాంటిక్ మెలోడీ గా అభిమానుల్ని తెగ ఆకట్టుకుంది . కాగా ఇదే క్రమంలో రీసెంట్గా గౌతమ్ తిన్నురి డైరెక్షన్లో స్టార్ట్ అయిన సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. విజయ్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా రిలీజ్ అయిన ఈ పోస్టర్ అభిమానులను తెగ ఆకట్టుకుంటుంది .ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై శ్రీకర స్టూడియో సమర్పణలో ఎస్‌ నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వీడీ12 వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా కి సంబంధించిన స్పెషల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు మేకర్స్.

పియానోని తలపిస్తూ పేర్చిన కాగితపు ముక్కల పై విజయ్ ఫేస్ కనిపించడం అభిమానులకు చాలా అట్రాక్టివ్ గా కనిపించింది . అంతేకాదు అలాగే పోస్టర్ పై” ఐ డోంట్ నో వే ఐ బి లోన్ టు టెల్ యు ట్రేడ్ ” అని రాసింది . “నేను ఎవరికి ద్రోహం చేశానో చెప్పడానికి నేను ఎక్కడ ఉన్నానో నాకే తెలియదు ..అనామక గూడాఛారి” అని రాసిఉన్నారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. చూస్తుంటే విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ కన్ ఫర్మ్ అంటున్నారు ఫ్యాన్స్. ఇందులో విజయ్ స్పై గా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది .

 

Share post:

Latest