అఖిల్ కెరీర్ కాపాడేందుకు రంగంలోకి దిగిన యూవీ క్రియేషన్.. టైటిల్ కూడా ఖరారు..

అక్కినేని అఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇటీవలే సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ‘ఏజెంట్’ సినిమాలో అఖిల్ హీరోగా నటించాడు. ఈ సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ నెగిటివ్ టాక్ కారణంగా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడింది. ఈ సినిమా కోసం పెట్టిన ఖర్చులో సగం కూడా రాకపోగా నిర్మాతలకు నష్టాన్ని మిగిల్చింది. ఇక అఖిల్ కెరీర్ ఈ సినిమా ద్వారా ఒక రేంజ్‌కి వెళ్తుందని అంతా అనుకున్నారు కానీ ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం అందుకోలేకపోయింది ఏజెంట్ సినిమా.

ఏజెంట్ సినిమాపై వస్తున్న నెగిటివ్ టాక్ నుంచి బయటికి రావడానికి కొత్త ప్రాజెక్ట్ తొందరగా స్టార్ట్ చేయాలని ప్రయత్నిస్తున్నాడు అఖిల్. కొన్ని నెలల క్రితం యూవీ క్రియేషన్స్ తో అఖిల్ ఒక సినిమా చేస్తున్నానని చెప్పాడు. అయితే దర్శకుడు ఎవరు అనేది అప్పుడు రివీల్ చేయలేదు. ప్రస్తుతం ఇండస్ట్రీ టాక్‌ని బట్టి చూస్తే అఖిల్ నటించబోయే సినిమాకి కొత్త డైరెక్టర్ అనిల్ దర్శకత్వం వహిస్తున్నట్లు తెలుస్తుంది. గతంలో యూవీ క్రియేషన్స్‌లో రిలీజ్ అయిన రాధే శ్యామ్, సాహో సినిమాలకు అనిల్ కో – డైరెక్టర్ గా పనిచేసాడు.

అనిల్ దర్శకత్వం వహిస్తున్న సినిమాకి టైటిల్ కూడా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అఖిల్ నటిస్తున్న 6వ సినిమాకి ‘ధీర ‘అనే టైటిల్ అనుకుంటున్నారట. ధీర అనే టైటిల్ స్టోరీకి కరెక్ట్‌గా సరిపోతుందని డైరెక్టర్ సూచించడంతో నిర్మాతలు, అఖిల్ కూడా ఒకే చెప్పేశారట. ఇక ఈ సినిమాని భారీ బడ్జెట్‌తో చిత్రీకరించాలని అనుకుంటున్నారట మూవీ క్రియేషన్స్ వారు. మరి ఈ సినిమా అయిన అఖిల్ కి ప్లస్ అవుతుందో లేదో చూడాలి.

Share post:

Latest