విరూపాక్ష: మొదటి రోజే కలెక్షన్స్ తో అదరగొట్టేసిన సాయి ధరంతేజ్..!

టాలీవుడ్ లో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం విరూపాక్ష.. అయితే ఈ సినిమా నిన్నటి రోజున ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.. తేజ్ కు యాక్సిడెంట్ తర్వాత నటించిన మొదటి చిత్రం.. ఇది కావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు ఏ విధంగా రాబడుతుందో అంటూ అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. రెగ్యులర్ స్టోరీ కాకుండా మిస్టరీ త్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం సాయి ధరంతేజ్ కు బాగానే కలిసి వచ్చిందని చెప్పవచ్చు. ఈ చిత్రానికి కథను సుకుమార్ రాయగా దర్శకత్వం కార్తీక్ దండు వ్యవహరించారు. హీరోయిన్గా సంయుక్త మీనన్ నటించింది.

Virupaksha Movie: Showtimes, Review, Songs, Trailer, Posters, News & Videos  | eTimes
ఈ సినిమా మొదటిరోజు కలెక్షన్ల విషయానికి వస్తే నైజాం లో రూ.1.82 కోట్లు సీడెడ్ లో రూ .54 లక్షలు అమెరికాలో రూ .54 లక్షలు తూర్పుగోదావరిలో 40 లక్షలు పశ్చిమగోదావరిలో రూ 47 లక్షలు గుంటూరులో రూ .46 లక్షలు కృష్ణాలు రూ .32 లక్షలు నెల్లూరులో రూ.20 లక్షలు. ఇలా మొత్తం తెలుగు రాష్ట్రాలలో కలుపుకొని.. రూ.4.79 కోట్ల రూపాయలు రాబట్టగా.. 11.85 కోట్ల రూపాయలు గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది.

Virupaksha' Telugu movie review - The South First

అయితే ఈ సినిమా మొత్తం బిజినెస్ కేవలం రూ.22.20 కోట్ల మేరకు కాగా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే కచ్చితంగా 23 కోట్ల రూపాయలు రాబట్టాల్సి ఉంది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి హీట్ గా నిలవాలి అంటే ఇంకా రూ .16 కోట్ల రూపాయలకు పైగా రాబట్టాలి. మరి ఏ మేరకు ఈ సినిమా కలెక్షన్లతో రాబట్టి సాయి ధరంతేజ్ కెరియర్ను మారుస్తుందో చూడాలి మరి. ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరియర్ లో అందుకున్న బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది.