కండల వీరుడుతో డేటింగ్ పై.. పూజ హెగ్డే రియాక్షన్ ఇదే..!!

గడిచిన కొన్ని నెలలుగా బాలీవుడ్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న వార్త పూజా హెగ్డే ,సల్మాన్ ఖాన్ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పూజా హెగ్డే తెలుగులో మాత్రం స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతోంది. ఈ క్రేజ్ తోనే బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టి నటించిన పెద్దగా కలిసి రాలేదు. ఈమె నటించిన సినిమాలన్నీ కూడా డిజాస్టర్లుగా మిగిలాయి. తాజాగా సల్మాన్ ఖాన్ సరసన కిసీకా భాయ్ కిసీ కీ జాన్ చిత్రంలో నటించింది. ఇందులో వెంకటేష్ కూడా నటిస్తున్నారు వెంకటేష్ చెల్లెలు పాత్రలో పూజా హెగ్డే నటించింది. తాజాగా సల్మాన్ ఖాన్ తో డేటింగ్ పై క్లారిటీ ఇచ్చింది వాటి గురించి తెలుసుకుందాం.

Pooja Hegde finds Salman Khan's bluntness refreshing: 'At least you know  what he is thinking' | Entertainment News,The Indian Express
గత కొద్దిరోజులుగా సల్మాన్ ఖాన్ పూజ ప్రేమలో ఉన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తూ ఉండడంతో తాజాగా ఈ రూమర్ల పైన స్పందిస్తూ గట్టి కౌంటర్ ఇచ్చింది పూజా హెగ్డే.. ప్రస్తుతం తాను ఒంటరిగా ఉన్నానని ఇప్పుడు తన ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందని తెలియజేసింది.. సల్మాన్ తో ప్రేమాయణం పై స్పందిస్తూ రూమర్ పట్ల నేనేమీ మాట్లాడగలను నా గురించి అనేక వార్తలు చదువుతూ ఉంటాను ప్రస్తుతం అయితే నేను ఒంటరిగా ఉన్నాను ఒంటరిగా ఉండేందుకు ఇష్టపడతాను తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయడం తనకు చాలా ఇష్టమని తెలిపింది. లవ్ చేయడానికి తనకి సమయమే లేదని తెలియజేస్తోంది.

Salman Khan, Pooja Hegde return from Ladakh post Bhaijaan shoot. Pics  inside - India Today
ఇలాంటి రూమర్స్ ఏ ఇండస్ట్రీలోకి వెళ్లిన వినిపిస్తూ ఉంటాయి.. అందుకే నేను వాటిని పట్టించుకోను అంటూ తెలియజేసింది. పూజ హెగ్డే, సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం ఈనెల 21న థియేటర్లో విడుదల కాబోతోంది. ఈ చిత్రాన్ని ఫర్హాద్ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. మరి ఈ విషయంతో నైనా సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే మాధ్య ఈ రూమర్స్ పుల్ స్టాప్ పడతాయేమో చూడలి మరి.