ఎన్టీఆర్ చేతికి ఉన్న ఆ వాచ్ ఎన్ని కోట్లో తెలుసా.. ఒక సినిమా తియ్యొచ్చు!

కాస్ట్లీ వ‌స్తువుల‌తో హెడ్ లైన్స్ లో నిల‌వ‌డం యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కు అల‌వాటే. తాజాగా మ‌రో ఖ‌రీదైన వాచ్ తో అంద‌రి మ‌తులు పోగొట్టేశాడు. బుధ‌వారం నైట్ ఎన్టీఆర్ నివాస‌రంలో ఓ గ్రాండ్ పార్టీ జ‌రిగిన సంగ‌తి తెలిసిందే. ఈ నైట్ పార్టీకి ద‌ర్శ‌క‌ధీరుడు రాజమౌళి, ఆయ‌న త‌న‌యుడు కార్తికేయ‌, కొరటాల శివ, త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌, మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మాత‌లు నవీన్ యెర్నేని, రవి శంకర్ తో స‌హా త‌దిత‌రులు హాజ‌రు అయ్యారు.

అమెజాన్ స్టూడియోస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫెర్రెల్ ఈ పార్టీకి హాజరు కావడం విశేషత సంతరించుకుంది. శ్రేయోభిలాషులు, సన్నిహితులతో గడిపిన ఈ క్షణాలు అద్భుతం అంటూ ఎన్టీఆర్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో ఈ పార్టీకి సంబంధించిన కొన్ని పిక్స్ లో అభిమానుల‌తో పంచుకున్నాడు.

ఈ పిక్స్ లో బ్లాక్ కలర్ టీషర్టులో ఎన్టీఆర్ స్టైలిష్ గా కనిపిస్తూ ఆక‌ట్టుకున్నాయి. అయితే ఎన్టీఆర్‌ లుక్ తో పాటు ఆయ‌న చేతికి ఉన్న వాచ్ కూడా అంద‌రినీ ఆక‌ర్షించింది. అదొక బ్రాండెడ్ వాచ్. దాని ధర ఎన్ని కోట్లో తెలిస్తే ఖ‌చ్చితంగా షాకైపోతారు. ఇంకా చెప్పాలంటే ఆ వాచ్ ధ‌ర‌తో ఓ సినిమాను నిర్మించ‌వ‌చ్చు. రిచార్డ్ మిల్లీ బ్రాండ్ కు చెందిన ఈ వాచీ ధర రూ. 8 కోట్ల కు పైమాటే. కాగా, గ‌తంలో కూడా ఖ‌రీదైన వాచీల‌తో ఎన్టీఆర్ వార్త‌ల్లో నిలిచాడు. ఇప్పుడే అదే సీన్ మ‌రోసారి రిపీట్ అయింది.