Kgf.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కేజిఎఫ్ నటి మాళవిక..!!

కన్నడ ఇండస్ట్రీలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన KGF సినిమా ఎంతటి పెద్ద సునామి సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇండియన్ బిగ్గెస్ట్ సినిమాలలో ఈ సినిమా కూడా ఒకటి రెండు భాగాలుగా తెరకెక్కించిన ఈ సినిమా ఎంతో అద్భుతంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో నటించిన ప్రతి ఒక్కరి నటన కూడా అద్భుతంగా ఆకట్టుకుంది.. అలా ఇందులో నటించిన వారిలో నటి మాళవిక అవినాష్ కూడా ఒకరు. ఈమెది ఈ సినిమాలో జర్నలిస్టు పాత్రలో అద్భుతంగా నటించింది.

KGF Chapter 2 actress Malavika Avinash begins dubbing for film. See BTS  pics - India Today
ఇందులో ఈమె కనిపించింది తక్కువసేపైనప్పటికీ కూడా.. కథ ముందుకు సాగే కొద్దీ ఈమె పాత్ర మరింత ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే ఈమె పాత్ర ప్రతి ఒక్కరికి కూడా గుర్తుండిపోయేలా ఉంటుంది. ఎంతో అద్భుతమైన పాత్రను పోషించిన ఈమె తాజాగా ఆసుపత్రి బెడ్డు పైన చూస్తూ ఉంటే అభిమానులు ఒకసారిగా షాక్ కు గురవుతున్నారు. తాజాగా ఇమే ఆరోగ్యం సరిగా లేని అందువలన ఆస్పత్రిలో చేరినట్లు తెలియజేసింది. స్వయంగా ఆసుపత్రి బెడ్ పైనుంచి ఉన్న ఒక ఫోటోని సైతం సోషల్ మీడియాలో షేర్ చేయడంతో మాళవిక అభిమానులు సైతం ఒక్కసారిగా కంగారు పడుతున్నారు..

பிரபல KGF நடிகை திடீர் உடல் நிலைகுறைவு!.. மருத்துவமனையில் தீவிர சிகிச்சை
మాళవిక మైగ్రేన్ సమస్య కారణంగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు తెలియజేసింది.. అంతేకాకుండా ఈమె ముఖం కూడా గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. ఈ ఫోటో షేర్ చేస్తూ అభిమానులను కూడా హెచ్చరిస్తోంది మాళవిక.. ఎవరైనా సరే మైగ్రేన్ సమస్య ఉంటే తలనొప్పి కదా అంటూ నిర్లక్ష్యం చేయవద్దు..

అలాగే అనుకుంటే మీరు కూడా నాలాగా ఆసుపత్రి పాలవుతారు అంటూ పోస్టుని షేర్ చేసింది. దీంతో అభిమానులు సైతం త్వరగా కోలుకోవాలని కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారు. ఈమె నటిగానే కాకుండా బిజెపి నాయకురాలు కూడా.