30 ఏళ్లు దాటినా పెళ్లికాని.. టాలీవుడ్ ముద‌రు హీరోయిన్లు వీళ్లే…!

చిత్ర పరిశ్రమ అంటేనే చాలామంది హీరోయిన్లు లేటు వయసులో పెళ్లి చేసుకుంటారు. అయితే వారిలో కొందరు మాత్రం సర్టెన్ ఏజ్ లోనే పెళ్లి చేసుకుని తన ఫ్యామిలీ లైఫ్ లో అడుగు పెడతారు. మరి కొంతమంది మాత్రం తమ కెరియర్ ఎక్కడ దెబ్బతింటుందనే ఉద్దేశంతో పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటారు. ఇక వారికి సినిమా అవకాశాలు తగ్గిన సమయంలో పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటర్ అవుతారు. ఇప్పుడు చిత్ర పరిశ్రమలో 30ఏళ్లు దాటిన పెళ్లి చేసుకొని స్టార్ హీరోయిన్లున్ ఎవరు ఇప్పుడు చూద్దాం.

అనుష్క:
ఇక పెళ్లికాని హీరోయిన్ల‌ లిస్టులో మొదటి ప్లేస్ లో అనుష్క పేరే వినిపిస్తుంది. ఇక అనుష్కకు 40 ఏళ్లు వచ్చినప్పటికీ కూడా ఇంకా పెళ్లి చేసుకోవడం లేదు. చాలా రోజుల నుంచి అనుష్క ప్రభాస్ తో ప్రేమలో ఉందని వార్తలు వస్తూనే ఉన్నాయి.

త్రిష :
గత రెండు దశాబ్దాలుగా సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న త్రిష.. ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్ తో దూసుకుపోతోంది. అయితే 39 ఏళ్లు వచ్చినా అమ్మడు ఇంకా పెళ్ళి చేసుకోలేదు. వాస్తవానికి వరుణ్ అనే బిజినెస్ మ్యాన్ తో త్రిష కొంతకాలం పాటు డేటింగ్ చేసింది. అతడితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుంది. కానీ మరికొన్ని రోజుల్లో మ్యారేజ్ చేసుకుంటారని అనుకుంటుండగా.. ఏం జరిగిందో ఏమో సడన్ గా పెళ్లి క్యాన్సిల్ చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు. అప్పటి నుంచి ఎప్పుడు పెళ్లి గురించి అడిగినా, సమాధానం దాటవేస్తూ వస్తోంది త్రిష.

తమన్నా :
మూడు పదుల వయస్సు దాటినా పెళ్లికి దూరంగా ఉన్న హీరోయిన్లలో తమన్నా ఒకరు. మిల్కీ బ్యూటీ తమన్నా వరుసగా సినిమాలలో నటిస్తున్నా ఆమె పెళ్లికి సంబంధించిన శుభవార్త చెప్పడం లేదు.

తాప్సీ పన్ను :
ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ ఆ తర్వాత తెలుగులో అవకాశాలు రాకపోవడంతో బాలీవుడ్‌కి వెళ్ళింది. ఇక ఈ హీరోయిన్ 34 ఏళ్లు వచ్చినా కూడా పెళ్లి చేసుకోవడం లేదు.

పూజా హెగ్డే :
తన అందంతో స్టార్ హీరోయిన్ లకు సైతం గట్టిపోటీ ఇచ్చిన పూజా హెగ్డే వయస్సు 30 సంవత్సరాలు. ఈమె కూడా ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా కనిపించడం లేదు.

శృతిహాసన్ :
కమల్ హాసన్ గారాల పట్టి శృతిహాసన్. ఈమె వయసు 36 సంవత్సరాలు. విదేశీయుడు తో ఒకానొక సమయంలో ప్రేమలో పడి, ఆ తర్వాత ఏవో కారణాల చేత బ్రేకప్ కూడా అయింది. ఇక పూర్తిగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి కొంత కాలం సినీ ఇండస్ట్రీకి దూరమైంది. ప్రస్తుతం ఈ హీరోయిన్ డూడుల్ ఆర్టిస్ట్ శాంతాను హాజరికతో రిలేషన్ లో ఉంది.

Is Shraddha Kapoor finally getting married? Actress makes the BIG REVEAL | Celebrities News – India TV

శ్రద్దా కపూర్:
సాహో భామ శ్రద్ధా కపూర్ ప్రస్తుత వయస్సు 36 ఏళ్లు. ఇటీవల కాలంలో బీ టౌన్ భామలు అందరూ ఒక్కరొక్కరుగా వివాహ బంధంలో అడుగుపెడుతున్న నేపధ్యంలో అమ్మడి పెళ్లెప్పుడు అని అభిమానులు ఆరాలు తీస్తున్నారు. రోహన్ శ్రేష్ఠ అనే వ్యక్తితో శ్రద్దా డేటింగ్ లో ఉన్నట్లు ఫిలిం సర్కిల్స్ లో రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఇంకా ఈ ముద్దుగుమ్మలే కాకుండా ఇలియానా – 34 సంవత్సరాలు, ఈషా రెబ్బ – 31 సంవత్సరాలు, తాప్సి – 32 సంవత్సరాలు, రకుల్ ప్రీతిసింగ్ – 32 సంవత్సరాలు, రష్మి గౌతమ్ – 38 సంవత్సరాలు, నిత్యామీనన్ – 32 సంవత్సరాలు, కృతి కర్బంద – 33 సంవత్సరాలు, టబు – 47 సంవత్సరాలు, అమీషా పటేల్ – 44 సంవత్సరాలు, ఐశ్వర్య రాజేష్ – 33 సంవత్సరాలు.. ఇక ఇంత వయసు వచ్చినప్పటికీ ఈ ముద్దుగుమ్మలు ఇంకా పెళ్లి వైపు అడుగులు వేయడం లేదు.