బాలయ్యకు శ్రీలీల కూతురు కాదట.. మరి ఏమౌతుంది అబ్బా..!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా సినిమాని యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. NBK108 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలయ్యను మునుపెన్నడూ చూడని విధంగా అనిల్ రావిపూడి ప్రెజెంట్ చేస్తుండటంతో టాలీవుడ్‌లోనే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది.

కాగా, ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్యకు కూతురు అనే విషయం ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కానీ, నిజానికి ఈ సినిమాలో బాలయ్య, శ్రీలీలకు తండ్రిగా కనిపించడట. అంటే… శరత్ కుమార్…ఈ సినిమాలో బాలకృష్ణకు అన్నయ్య పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. బాలకృష్ణ హీరోగా డిఫరెంట్ యాక్షన్ డ్రామాను అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్నారు.

ఇక రీసెంట్ గానే అనిల్ రావుపూడి ఓ ఎమోషనల్ సీన్ చిత్రీకరించారట. ఈ సినిమాలో బాలయ్య శ్రీలీల‌ కాంబోలో వచ్చే ఎమోషనల్ సన్నివేశాలు సినిమాకే ఎంతో హైలెట్ గా ఉంటాయని తెలుస్తుంది. శ్రీలీల ఈ సినిమాలో కీలకపాత్రలో కనిపించనుంది. ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్ గా హిందీ నటుడు అర్జున్ రామ్‌పాల్ నటిస్తున్నాడు. బాలయ్య తన పాత సినిమాలకు భిన్నంగా ఎంతో కొత్తగా కనిపించబోతున్నాడని తెలుస్తుంది.

శ్రీలీల, శరత్ కుమార్, హీరో మధ్య సీన్లు కొత్తగా ఉంటాయని తెలిసింది. ఈ సినిమాకు ఆ సీన్లు ఆయువు పట్టు లాంటివి అని తెలిసింది. బాలయ్యకు భార్యగా అందాల భామ కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో న‌టిస్తుంది. ప్రస్తుతం ఎంతో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో బాలయ్య తెలంగాణ భాషలో మాట్లాడుతాడని తెలుస్తోంది. ఇక ఈ సినిమాను విజయ దశమికి ఆయుధ పూజ” అంటూ దసరా బరిలో సినిమాను విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించారు.