అనుష్కతో నవీన్ పొలిశెట్టి సీక్రెట్ అఫైర్.. వీరి రొమాంటిక్ విషయాలన్నీ తెలిసిపోయాయి!!

‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ అనే సినిమాలో అనుష్క, నవీన్ పోలిశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఆసక్తికరమైన టైటిల్ వస్తున్న ఈ సినిమాలో అనుష్క చెఫ్ అన్విత పాత్రలో నటిస్తుండగా, నవీన్ పొలిశెట్టి స్టాండప్ కమెడియన్ సిద్ధు పాత్రలో నటిస్తున్నారు. ఈ హిందీ సినిమాకి మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా గురించి దర్శకుడు మహేష్ మాట్లాడుతూ “నేను లండన్‌కు చెందిన చెఫ్ పాత్ర రాసే సమయంలో అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ నటిస్తుందని అసలు అనుకోలేదు. ఆమె స్టోరీ విని ఓకే చెప్పగానే నా అదృష్టాన్ని నేను నమ్మలేకపోయాను. ఇలాంటి పాత్ర అనుష్క ఇంతకు ముందు చేసిన పాత్రలకు భిన్నంగా ఉంటుంది. అన్విత చాలా స్వతంత్రంగా ఉంటుంది, ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతుంది. అలానే సాంప్రదాయ నిబంధనలకు దూరంగా ఉండే అమ్మాయి.” అని మహేష్ చెప్పారు.

ఇక నవీన్ పొలిశెట్టి గురించి మహేష్ మాట్లాడుతూ “ఆ పాత్ర నవీన్ పోలిశెట్టి కి సరిగ్గా సరిపోయింది. అయితే నవీన్, అనుష్క స్క్రీన్ పై ఎలా కనిపిస్తారో అనేది చూడాలి. అయితే, మొదటి ఫ్రేమ్ నుండి, ఇది ప్యూర్ మ్యాజిక్ అని మాకు తెలుసు. ఎందుకంటే ఈ సినిమా లో ఒక యువకుడు తన కంటే ఎక్కువ వయసు ఉన్న మహిళతో ప్రేమలో పడటమే కథ. వాస్తవంగా అనుష్క, నవీన్ ఈ చిత్రంలో వారి వయస్సును పోషిస్తున్నారు, కానీ కథ మాత్రం దాని గురించి కాదు. నిజం చెప్పాలంటే ఈ తరానికి వయస్సు అనేది పెద్ద విషయం కాదు. కాబట్టి
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ లో అనుష్క, నవీన్ పొలిశెట్టి పాత్రలు ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తాయి ” అని మహేష్ చెప్తున్నారు.