విదేశీ యాసలో మాట్లాడిన సమంత.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.

పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు విన్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆస్కార్ వేడుక కోసం అమెరికా వెళ్లిన ఆర్ఆర్ఆర్ చిత్ర బృందంలోని ఎన్టీఆర్, రామ్ చరణ్‌ అక్కడి మీడియాతో మాట్లాడేటప్పుడు అమెరికా స్టైల్‌లో మాట్లాడారు. హాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించడం కోసమే వారు మాట్లాడారని సోషల్ మీడియాలో రకరకాల ట్రోల్స్, మీమ్స్ వచ్చాయి.

తాజాగా సమంత కూడా ఈ ట్రోలింగ్ లిస్ట్‌లో చేరింది. ఇటీవలే సిటాడెల్ సిరీస్ లండన్ ప్రీమియర్‌కు హాజరైంది సమంత. సిటాడెల్ ఇండియన్ టీమ్ అక్కడి మీడియాతో ముచ్చటించారు. డైరెక్టర్స్, హీరో వరుణ్ ధావన్ ఇండియన్ ఇంగ్లీష్ స్లాంగ్ లో మాట్లాడగా, సమంత మాత్రం ఫారిన్ స్లాంగ్ మాట్లాడింది. ప్రస్తుతం సమంత ఫారిన్ స్లాంగ్‌ని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు.

ఆ ఫేక్ స్లాంగ్ అవసరమా సామ్ నీకు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తుంటే, మరికొంతమందేమో ఆ యాస సమంతకి సూట్ అవ్వలేదని కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా సమంత ఫారిన్ అమ్మాయి కాదు కేరళ అమ్మాయి అని ఏవరైనా ఆమెకి గుర్తు చేయండి అంటూ కొంతమంది కామెంట్స్ చేసారు. ప్రస్తుతం సమంతపై వస్తున్న ట్రోల్స్, మీమ్స్ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

సిటాడెల్ అమెరికన్ సిరీస్ లో ప్రియాంక చోప్రా, రిచర్డ్ మాడెన్ ప్రాధాన పాత్రలో నటించారు. ఏప్రిల్ 28న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ కానుంది. ఇక ఇండియా వెర్షన్ సిటాడెల్ లో సమంత, వరుణ్ దావన్ ముఖ్య పాత్రలలో నటిస్తుండగా, రాజ్ అండ్ డి కే దర్శకత్వం వహిస్తున్నారు. సిటాడెల్ సిరీస్ తో పాటుగా సమంత, విజయ్ దేవరకొండ సరసన ‘ఖుషి’ సినిమాలో కూడా నటిస్తుంది.