అందుకే అతని చెంప పగలగొట్టిన సంయుక్త మీనన్..!!

ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఇటీవల విడుదలైన విరూపాక్ష సినిమా పెను సంచలనాన్ని సృష్టించింది. కలెక్షన్ల పరంగా కూడా భారీగానే రాబడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో హీరోయిన్ సంయుక్త క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం ఈమె డేరింగ్ అండ్ డాషింగ్ యాటిట్యూడ్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా ఇమే పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపింది.

Samyuktha Menon New Onam Photos 2022 001 - Kerala9.com
సంయుక్త మీనన్ మాట్లాడుతూ.. తన తల్లిని ఇబ్బంది పెట్టిన వ్యక్తిని చెంప పగలగొట్టానని తెలియజేస్తోంది. అయితే ఇది ఇప్పుడు జరిగిన సంఘటన కాదని దాదాపుగా కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనని తెలుపుతోంది. నేను మా అమ్మ కలిసి ఒకసారి బయటికి వెళ్లాము..ఒకచోట నిలబడి ఉన్నాము అక్కడే ఉన్న ఒక వ్యక్తి సిగరెట్ తాగుతూ ఉన్నారు.ఆ పొగ మా వైపుగా వస్తూనే ఉంది మేము అక్కడి నుంచి పక్కకు వెళదాం అనుకుంటే అసలు అక్కడ ప్లేసే లేదు.. అంతేకాకుండా ఈమె తల్లికి శ్వాసకోశ సంబంధిత సమస్యలు కూడా ఉన్నాయట.దీంతో ఆ పొగ వల్ల తను చాలా ఇబ్బంది పడటంతో.. ఆ వ్యక్తిని అక్కడి నుంచి పక్కకు వెళ్లి తాగమని రిక్వెస్ట్ చేశాము కానీ వినలేదు పైగా తమతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో కోపంతో ఒక్కసారిగా అతని చెంప చెల్లు మనిపించానని తెలిపింది సంయుక్త మీనన్.

మొదట ఈమె 2016 లో వచ్చిన పాప్ కార్న్ సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాతో తెలుగుతరకు అడుగు పెట్టింది. ఆ వెంటనే బింబిసార, సార్, విరూపాక్ష సినిమాలతో మంచి విజయాలను అందుకుంది ప్రస్తుతం డెవిల్ అనే సినిమాలో నటిస్తోంది.