చలాకి చంటి కి అండగా అనసూయ..!!

తెలుగు బుల్లితెరపై మోస్ట్ పాపులర్ షో గా పేరు పొందింది జబర్దస్త్ షో. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ సైతం మంచి పాపులారిటీ సంపాదించారు. అలాంటి పాపులారిటీతోనే సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటున్నారు. అలా ఇప్పటివరకు సుధీర్, రష్మీ ,అనసూయ ,గెటప్ శ్రీను, చమ్మక్ చంద్ర, చలాకి చంటి, వేణు ధనరాజ్ తదితరులు సైతం సినిమాలలో బిజీగా ఉంటున్నారు. ఇందులో చలాకి చంటి కి గుండెపోటు వచ్చిందంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే ఈ విషయంపై ఎవరూ కూడా ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. దీంతో అభిమానులు కాస్త సతమతమవుతున్నారని తెలుస్తోంది. చలాకీ చంటి కి ఆపరేషన్ చేసి స్టంట్ వేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం చలాకి చంటి ఆరోగ్యం బాగానే ఉందని అయితే తాను కోలుకోవడానికి మాత్రం చాలా సమయం పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవల చలాకి చంటి గత సీజన్ బిగ్ బాస్-6 లో పాల్గొనడం జరిగింది అయితే అందులో నుంచి బయటికి వచ్చాక మాత్రం ఎక్కడ కనిపించలేదు.

Celebrity Gossips Hollywood: Anchor Anasuya leg show in short skirt

అయితే చలాకి చంటి కి హార్ట్ ఎటాక్ వచ్చిందని విషయం తెలిసి సినీ ప్రేక్షకులు అభిమానులు సైతం త్వరగా కోలుకోవాలని తెలియజేస్తున్నారు. ఎప్పుడు చలాకీగా ఉండే చలాకీ చంటి కి ఇలా గుండెపోటు రావడంతో ఒకసారిగా షాక్ అవుతున్నారు. చలాకి చంటి హోస్టుగా నా షో నా ఇష్టం ద్వారా మంచి పాపులారిటీ సంపాదించారు. అయితే ఇప్పటివరకు ఈ విషయం పైన జబర్దస్త్ కమెడియన్స్ కూడా స్పందించలేదు అయితే తాజాగా అనసూయ హాస్పిటల్ కి వెళ్లి చలాకి చంటిని పరామర్శించినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా చంటి ఆరోగ్యం గురించి కూడా వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన చికిత్స అందించాలని కోరినట్లుగా సమాచారం.అయితే గతంలో వీరిద్దరి మధ్య ఉన్న స్నేహబంధం కారణంగానే అనసూయ చంటిని చూడడానికి వెళ్ళినట్లు సమాచారం.