తాను చేసిన సినిమాలో ..ప్రభాస్ కి పరమ అసహ్యం అయిన సినిమా ఏంటో తెలుసా..?

టాలీవుడ్ రెబల్ హీరోగా పేరు సంపాదించుకున్న ప్రభాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే . హైట్ కి హైట్.. వెయిట్ కి వెయిట్.. అందానికి అందం.. నటనకి నటన .. ఏ విషయంలోనూ నెగటివ్ మార్కింగ్ లేకుండా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా దూసుకుపోతున్న ప్రభాస్ ప్రెసెంట్ ఆయన చేస్తున్న సినిమాలు అన్ని పాన్ ఇండియా లెవెల్ లోనే రిలీజ్ కు సిద్ధం చేస్తున్నాడు. నిజం చెప్పాలంటే బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ హిట్ కొట్టిందే లేదు .

బాహుబలి తర్వాత రిలీజ్ అయిన సాహూ.. ఆ తర్వాత రిలీజ్ అయిన రాధే శ్యామ్ రెండు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ లు అయ్యాయి . ఈ క్రమంలోనే ప్రభాస్ నుంచి వచ్చే తదుపరి సినిమా ఖచ్చితంగా హిట్ కొట్టే విధంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే ప్రభాస్ కి సంబంధించిన చిన్న విషయాన్ని కూడా సోషల్ మీడియాలో హ్యుజ్ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు . ఈ క్రమంలోనే ప్రభాస్ తన కెరియర్ లో ఎన్నో సినిమాల్లో నటించిన ఓ సినిమా అంటే మాత్రం అస్సలు పడదని .. ఇప్పటికే ఆ సినిమా టీవీలో వచ్చిన ప్రభాస్ చూడడు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది .

ఆ సినిమా మరేదో కాదు వివి వినాయక్ డైరెక్షన్లో తెరకెక్కి 2007లో గ్రాండ్గా రిలీజ్ అయిన యోగి . ఎస్ ఈ సినిమా అంటే ప్రభాస్ కి అస్సలు ఇష్టం లేదట . ఇష్టం లేకుండానే ఈ సినిమాను చేసి డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్నాడు . అంతేకాదు ఈ సినిమాలో పెద్దగా కంటెంట్ లేదు.. మదర్ సెంటిమెంట్ తో ముందుకెళ్లిన లాస్ట్ లో సీన్ రివర్స్ చేసేస్తాడు. ఈ క్రమంలోనే కధ వినగానే క్లైమాక్స్ మార్చకపోతే ఫ్లాప్ అవుతుందని ప్రభాస్ చెప్పారట. అయినా వినాయక్ వినకుండా అదే క్లైమాక్స్ ను సెట్ చేసే సినిమాని అట్టర్ ఫ్లాప్ చేసేసారు . ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన నయన్ నటన కూడా టు ఓవర్ యాక్టింగ్ అనిపించింది అంటూ అప్పట్లో కామెంట్స్ వినిపించాయి . అందుకే ప్రభాస్ కి ఈ సినిమా అంటే అస్సలు నచ్చదు అంటూ ఓ న్యూస్ వైరల్ అవుతుంది..!!