ఆ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిన సమంత.. ఇక సీన్ సితారే!

కొంతమంది అభిమానులు తన ఫేవరెట్ హీరో, హీరోయిన్స్‌ని ఎంతగా అభిమానిస్తారంటే వారే తమ ధైవంగా భావిస్తుంటారు. ఫేవరెట్ హీరోయిన్ లేదా హీరోకి చిన్న ఆపద వచ్చినా తట్టుకోలేరు. వారి బాగోగుల కోసం పూజలు, వ్రతాలు చేయిస్తుంటారు. ఇది కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాకుండా రాజకీయ నాయకుల విషయంలో కూడా జరుగుతూనే ఉంటుంది.

ఇలా అభిమానులు కొంతమంది వారు అభిమానించే వారికి గుడి కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో హీరోయిన్స్ ఖుష్భూ, హన్సికలకు వారి అభిమానులు గుడి కట్టి పూజించారనే విషయం చాలా మందికి తెలుసు. తాజాగా ఆ జాబితాలో సమంత కూడా చేరిపోయింది. ఒక వీరాభిమాని సమంతకు గుడి కట్టిస్తున్నారు. గత ఏడాది మయోసైటీస్ వ్యాధి బారిన పడిన సమంత ఇప్పుడిప్పుడే కోలుకొని సినిమాలో బిజీ అవుతుంది.

ఎమ్ మయా చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ అమ్మడు ఆ తరువాత ఎన్నో సూపర్ హిట్ సినిమాలో నటించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న సామ్ అనారోగ్యం బారిన పడటంతో ఆమెని అభిమానించేవారు అందరూ ఎన్నో పూజలు వ్రతాలు చేసారు. అయితే ఆంధ్రప్రదేశ్ కి చెందిన సందీప్ అనే వ్యక్తి సమంతకి గుడి కట్టించాడు. ఆమె పుట్టినరోజు సందర్భంగా సామ్ కి గిఫ్ట్‌ ఇవ్వబోతున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వార్తలు వైరల్ గా మారాయి.

నిర్మాత చిట్టిబాబు ఆమెను ‘శకుంతల ఐకానిక్ బ్యూటీకి తగినది కాదు’ అని పిలిచిన కొన్ని రోజుల తర్వాత, సమంతా రూత్ ప్రభు ఆమె హాస్పిటల్ సందర్శనలు, జిమ్ సెషన్‌లు, వివిధ రకాల శిక్షణా సెషన్‌ల మధ్య ఎలా మారుతుందో గురించి కొన్ని ఫొటోలు కూడా పంచుకున్నారు. శాకుంతలం చిత్రంలో సమంత ప్రధాన పాత్ర పోషించింది.