నా తమన్నాతో తిరుగుతున్నావా.. విజ‌య్ వ‌ర్మ‌తో బాలీవుడ్ న‌టుడు గొడ‌వ‌!

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా, బాలీవుడ్ న‌టుడు విజ‌య్ వ‌ర్మ ప్రేమ‌లో ప‌డ్డార‌ని ఎప్ప‌టి నుంచో ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రూ స‌న్నిహితంగా ఉండ‌డ‌మే కాకుండా.. ప‌లుమార్లు జంట‌గా మీడియాకు చిక్కుతూ నెట్టింట జ‌రుగుతున్న ప్ర‌చారానికి మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తున్నారు. తాజాగా మ‌రోసారి త‌మ‌న్నా, విజ‌య్ వ‌ర్మ కలిసి కనిపించారు.

వీరిద్దరూ ఒకే కారులో డిన్నర్ నైట్ కి వెళుతూ కెమెరా కంటికి చిక్కారు. దీంతో త‌మ‌న్నా, విజ‌య్ ల‌వ్ ట్రాక్ నిజ‌మే అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా వీరిద్ద‌రి రిలేషన్షిప్ పై విజయ్ వర్మ స్నేహితుడు, సహనటుడు గుల్షన్ దేవయ్య షాకింగ్ కామెంట్ లు చేశాడు. నా తమన్నాతో తిరుగుతున్నావా అంటూ విజ‌య్ వ‌ర్మ‌తో గొడ‌వ‌కు దిగాడు.

అస‌లేం జ‌రిగింది. విజయ్ వర్మ న‌టించిన‌ తాజా వెబ్ సిరీస్ ‘దహాద్’ టీజర్ రిలీజ్ అయ్యింది. ఆ టీజర్ ని విజయ్ వర్మ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. దాని కింద బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య వైరల్ కామెంట్స్ చేశాడు. `నా తమన్నాతో నువ్వు తిరుగుతున్నావా.. నాకు సరైన బుద్ధి చెప్పావు. ఇంక నా పరువు తియ్యనందుకు థాంక్యూ. లేకుంటే ఏమి జరిగేదో. హే రామ్` అంటూ కామెంట్ చేశాడు. గుల్షన్ ఈ కామెంట్స్ విజయ్ ని ఆటపట్టించడానికే చేసినా.. నెట్టింట మాత్రం ఆయ‌న కామెంట్స్ తెగ వైర‌ల్ అవుతున్నాయి.