Niharika: కూతురు కోసం అంత నీచానికి దిగజారిన నాగబాబు..!

Niharika: గత కొద్ది రోజులుగా నాగబాబు కూతురు నిహారిక (Niharika)తన భర్త చైతన్య నుంచి విడిపోతోంది అంటూ వార్తలు బాగా షికారులు చేస్తున్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే ఒకరికొకరు ఇంస్టాగ్రామ్ లో అన్ ఫాలో చేసుకోవడం, పైగా పెళ్లినాటి ఫోటోలను డిలీట్ చేయడం అన్నీ కూడా పలు అనుమానాలను రేకర్తించాయి. అయితే ఎవరు స్పందించలేదు. పైగా ఎవరికి నచ్చినట్టు వారు జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ రకరకాల ఫోటోషూట్లతో యువతను అలరిస్తున్నారే కానీ వీరి వివాహ రద్దు మాటలపై ఏమాత్రం స్పందించడం లేదు.

Sai Dharam Tej refutes reports about 'upcoming marriage' to Niharika  Konidela-Entertainment News , Firstpost

ప్రస్తుతం నిహారిక భర్త నుంచి దూరంగా పుట్టింట్లోనే ఉంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే నిహారిక తన భర్త చైతన్యతో విడాకుల మంజూరు అధికారిక ప్రకటన రాలేదు కానీ ఇప్పుడు నిహారిక కోసం నాగబాబు (Nagababu) మరో పెళ్లి చేసే ప్రయత్నం చేస్తున్నారు అంటూ వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. వాస్తవానికి నాగబాబు సోదరి కొడుకు అయిన సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej)తో నిహారిక మొదటి వివాహం జరగాల్సి ఉంది. కానీ అప్పుడు సాయిధరమ్ తేజ్ కు నిహారిక పై పెళ్లి చేసుకునే అంత ఇష్టం లేకపోవడం వల్లే ఆ పెళ్లి జరగలేదు.

అయితే నిహారిక ఇప్పుడు చైతన్య జొన్నలగడ్డను వివాహం చేసుకున్నప్పటికీ అతనితో జీవితం కొనసాగించలేక విడాకులు తీసుకుంటుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే బాగా ఆలోచించిన నాగబాబు ఇప్పటికే తన కూతురికి పెళ్లి అయింది. ఆల్రెడీ విడాకులు తీసుకున్న అమ్మాయికి ఇంకో వివాహం అంటే వరుడు దొరకడం కష్టంగా ఉంటుంది. అందుకే తన సోదరుడి కొడుకు అయినా సాయిధరమ్ తేజ్ కు ఇచ్చి వివాహం జరిపించాలని నాగబాబు అనుకుంటున్నట్లు సమాచారం.

మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ సాయిధరమ్ తేజ్ కు ఇచ్చి వివాహం జరిపించబోతున్నారు అంటూ ఒక వార్త నెట్టింట చెక్కర్లు కొడుతోంది. ఇది చూసిన చాలామంది కూతురు కాపురం చక్క పెట్టాల్సింది పోయి ఇంత నీచానికి దిగజారుతూ రెండో పెళ్లి అన్నమాట ఎత్తుతున్నాడు అంటూ నాగబాబుపై నేటిజన్లు ఫైర్ అవుతున్నట్లు సమాచారం.