“అక్కినేని నాగచైతన్య తో పెళ్లి నిజమే”.. శోభిత ధూళ్లిపాళ్ల సెన్సేషనల్ పోస్ట్ వైరల్..!?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్ స్టార్ హీరో గా పాపులారిటీ సంపాదించుకున్న నాగచైతన్య.. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల పేర్లు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . వీళ్ళ మధ్య ఏదో నడుస్తుంది అంటూ జనాలు భావిస్తున్నారు . దానికి తగ్గట్టే వీళ్ళు కలిసి దిగిన ఫోటోషూట్స్.. సీక్రెట్ గా దిగిన పిక్స్ లీ అవ్వడంతో త్వరలోనే ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారు అని అభిమానులు ఫిక్స్ అయిపోయారు.

అంతేకాదు రీసెంట్ గా తన సోదరి పెళ్లి లో దిగిన కొన్ని పిక్స్ ని షేర్ చేస్తూ.. తన పెళ్లి పై పరోక్ష హింట్ ఇచ్చింది. ఆమె నార్త్ – సౌత్ ని కలిసినప్పుడే కలిసినప్పుడు అనే క్యాప్షన్ పెట్టింది . ఆమె పోస్ట్ చేసిన కొన్ని క్షణాల్లోనే అది వైరల్ గా మారిపోయింది . పెళ్లికి ఎటువంటి భేదాలు లేవు అని చెప్పకనే చెప్పేసింది. అంతేకాదు ఈ పోస్ట్ ద్వారా తనకు చైతన్యతో పెళ్లి ఇష్టమే అంటూ కూడా చెప్పకనే చెప్పింది అని ఫ్యాన్స్ ఆమె పోస్ట్ ని ట్రెండ్ చేస్తున్నారు .

అంతేకాదు తన సోదరీ పెళ్లి చేసుకున్న వ్యక్తి ఢిల్లి కి చెందిన వాడు తన సోదరీ ఆంధ్రప్రదేశ్ కి చెందినది అంటూ రాసుకోచ్చింది. ఈ క్రమంలోనే పెళ్లి పై ఎంతో నమ్మకం ఉంది అన్న నోట్ ని మెన్షన్ చేసింది . దీంతో ఉత్తరం – దక్షిణాది వివాహం అంటూ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకోచ్చిన శోభిత పోస్ట్ ని నాగచైతన్య ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు . అంతేకాదు నిజంగా శోభిత – నాగచైతన్య కి పర్ఫెక్ట్ జంట అని..వీళ్లు పెళ్లి చేసుకుంటే బావుంటుంది అంటూ సజెస్ట్ చేస్తున్నారు . చూద్దాం మరి ఈ జంట ఎప్పుడూ ఆ గుడ్ న్యూస్ చెప్తుందో..?