బాలీవుడ్ సీక్రెట్స్ బట్టబయలు చేసిన ప్రియాంక.. వాటిని అప్పుడే క్షమించాను అంటూ..

బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. క్రిష్, డాన్, ఓం శాంతి ఓం, ఫ్యాషన్, బాజీరావు మస్తానీ లాంటి హిట్ సినిమాలలో నటించింది. ఆమె నటనతో అందంతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకొని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ తరువాత 2019లో బాలీవుడ్ ఇండస్ట్రీకి దూరం అయింది. ఆ ఏడాది ఆమె నటించిన చివరి సినిమా ‘ది స్కై ఇన్ పింక్ ‘. ఈ సినిమా తరువాత ఆమె బాలీవుడ్‌లో కొత్త ప్రాజెక్ట్‌కి సైన్ చెయ్యలేదు. ఇక నిక్ ని పెళ్లి చేసుకొని లాస్ ఏంజెల్స్ అనే సిటీలో సెట్టిల్ అయిన ప్రియాంక హాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది.

అయితే ఇటీవలే ప్రియాంక చోప్రా బాలీవుడ్ రాజకీయాల్లో విసిగిపోయాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంపై సినీ ప్రముఖులు రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇన్నేళ్లు సైలెంట్ గా ఉన్న ప్రియాంక ఇప్పుడెందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ప్రియాంక చోప్రా ఈ విషయంపై స్పందించారు. ‘సిటాడెల్’ వెబ్‌సిరీస్ ప్రీమియర్లో భాగంగా మీడియాతో మాట్లాడిన ప్రియాంక ‘ బాలీవుడ్‌లో తాను గందరగోళ సంబంధాలు చూసానని, కానీ వాటిని అప్పుడే మర్చిపోయానని చెప్పింది’.

ఇటీవల ప్రియాంక ఓ పాడ్‌కాస్ట్‌లో ‘చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు తన జీవితంలో జరిగిన ప్రతీ ఒక్క విషయం గురించి మాట్లాడాను. అన్ని విషయాలు దాచకుండా నిజాలు మాత్రమే చెప్పాను. దాంట్లో భాగంగానే నా జీవితంలో జరిగిన బాలీవుడ్ రాజకీయాల గురించి చెప్పాను. ఈ విషయం గురించి మాట్లాడానికి నాకు ఇన్నేళ్లకు ధైర్యం వచ్చింది. అయితే ఆ రాజకీయాలు అన్నిటి గురించి మర్చిపోయి నా ప్రశాంతతను నేను చూసుకున్నాను. అందుకే వీటి గురించి పంచుకోగలిగాను’ అని చెప్పింది.