ఆక‌ట్టుకుంటున్న మంచు మనోజ్‌-మౌనిక పెళ్లి వీడియో.. మీరు చూశారా..?

మంచు మ‌నోజ్ ఇటీవ‌లే ఓ ఇంటి వాడు అయిన సంగ‌తి తెలిసిందే. భూమా మౌనిక రెడ్డి మెడ‌లో మంచు మ‌నోజ్ మూడు ముళ్లు వేశాడు. మార్చి నెల‌లో మంచు ల‌క్ష్మి నివాసంలో మ‌నోజ్‌-మౌనిక వివాహం అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. వీరిద్ద‌రికీ ఇది రెండో వివాహ‌మే. మ‌నోజ్ గ‌తంలో ప్ర‌ణ‌తి రెడ్డిని పెళ్లి చేసుకోగా.. వ్య‌క్తిగ‌త విభేదాల కార‌ణంగా విడాకులు తీసుకున్నారు.

అలాగే మౌనిక‌కు కూడా గ‌తంలో పెళ్లి జ‌రిగి.. ఓ కుమారుడికి జ‌న్మ‌నిచ్చింది. అయితే కొడుకు పుట్టిన త‌ర్వాత మ‌న‌స్ప‌ర్థ‌ల వ‌ల్ల మౌనిక మొద‌టి భ‌ర్త నుంచి విడాకులు తీసుకుంది. ఆ త‌ర్వాత మ‌నోజ్ తో ఏర్ప‌డ్డ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారి పెళ్లి వ‌ర‌కు వ‌చ్చింది. అయితే ప్రేమ, పెళ్లి వెనకాల నాలుగేళ్ల పోరాటం ఉందని ఇటీవల మ‌నోజ్‌ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.

దీంతో పెళ్లి చేసుకునేందుకు ఈ జంట ఎన్నో క‌ష్టాలు ప‌డ్డార‌ని స్ప‌ష్టంగా అర్థ‌మైంది. అయితే వీళ్ల జర్నీని, పెళ్లిలో అద్భుతమైన మూమెంట్స్ ని పాట రూపంలో చిత్రీక‌రించారు. `ఏం మనసో` అంటూ సాగే ప్రేమ గీతాన్ని తాజాగా మనోజ్‌ విడుదల చేశారు. ట్విట్టర్‌ ద్వారా ఆయన అభిమానులతో పంచుకున్నారు. మంచు మనోజ్‌-మౌనిక పెళ్లి వీడియో అంద‌రినీ ఎంత‌గానో ఆక‌ట్టుకుంటోంది. ఈ వీడియోలో అత్యంత ఆనందకర, భావోద్వేగభరిత మూమెంట్లని చూపించారు. అలాగే మౌనిక రెడ్డి త‌న‌యుడి బాధ్య‌త‌ల‌ను కూడా మ‌నోజ్ తీసుకుంటున్న‌ట్లు ఈ వీడియోలో ప‌రోక్షంగా చెప్పేశారు. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది.