కీర్తి సురేష్ పెళ్లి చేసుకోక పోవడానికి కారణం ఆ సమస్యనా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ కీర్తి సురేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినీ ఇండస్ట్రీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన ఈమె తన సొంత టాలెంట్ తో మరింత పాపులారిటీని సంపాదించుకుంది. మొట్ట మొదట నేను శైలజ అనే సినిమా తో రామ్ సరసన నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తరువాత మహానటి సావిత్రి బయోపిక్ లో నటించి నేషనల్ అవార్డును సొంతం చేసుకుంది కీర్తి సురేష్.

Menaka Suresh responds to Keerthy Suresh's marriage with childhood friend -  CINEMA - CINE NEWS | Kerala Kaumudi Online

ఈమె అందంతో అమాయకత్వంతో కుర్ర కారులను తన చుట్టూ తిప్పుకుంటుంది ఈ అమ్మడు. ఈమె పద్ధతికి కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. అయితే ఈమధ్య సర్కారి వారి పాట సినిమాలో మహేష్ బాబు సరసన నటించిన సినిమాలో తన లుక్కునే మార్చేసింది. అంతేకాకుండా అంత బొద్దుగా ఉన్న కీర్తి సురేష్ చాలా బరువు తగ్గి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.. రీసెంట్గా దసరా సినిమాతో అదరగొట్టింది. ఎక్కడ చూసిన కీర్తి సురేష్ డాన్స్ స్టెప్పులు సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ గా మారుతున్నాయి..

కీర్తి సురేష్ వ్యక్తిగత జీవితానికి వస్తే.. ఎప్పుడు వివాహం చేసుకుంటుంది అంటూ అభిమానులు చాలా ఆత్రుతగా ఉన్నారు..ఈ సమయంలోనే కీర్తి సురేష్ పెళ్లి గురించి ప్రశ్న ఎదురవటంతో ఈమె ఇచ్చిన జవాబు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది..అసలు విషయంలోకి వెళ్తే.. కీర్తి సురేష్ తాజాగా ఫాలోవర్స్ తో సరదాగా చిట్ చాట్ నిర్వహించింది.. అందులో నేటిజెన్లుల ప్రశ్నలకు చాలా ఓపికగా సమాధానాలు ఇచ్చింది. ఇందులో భాగంగా ఒక నేటిజన్ మీ పెళ్లి ఎప్పుడు అని అడగడంతో కీర్తి సురేష్ ఏం చెప్పకుండా ఒక ఎమోజినీ పంచుకుంది. అందులో జోబీలు ఖాళీగా ఉన్నట్టు కనిపించాయి. దీంతో పలువురు నేటిజెన్లు సైతం కీర్తి సురేష్ పెళ్లి చేసుకోవడానికి డబ్బులు లేవా అంటూ కామెంట్లు చేస్తున్నారు.. మరి కొంతమంది ఫన్నీగా ఇలాంటి సమాధానాలు చెప్తే ఎలా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. గతంలో కూడా ఈమె పైన పెళ్లి రూమర్స్ చాలానే వినిపించాయి. మరి ఏడాదైనా వివాహ విషయాన్ని తెలియజేస్తుందేమో చూడాలి మరి.