కూతురు కోసం కలిసుంటున్న కళ్యాణ్ దేవ్, శ్రీజ?

కళ్యాణ్ దేవ్, శ్రీజలను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, అల్లుడు కళ్యాణ్ దేవ్ దంపతులకు ఆమధ్య పండంటి ఆడబిడ్డ జన్మించిన సంగతి విదితమే. ఆ తరువాత కొన్నాళ్ళకు వీరు విడిపోయారని, విడిపోతారని రకరకాలుగా వార్తలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొట్టాయి. విషయం ఎవరికీ పూర్తిగా తెలియదు గాని, చిరంజీవి ఇంటి విషయం అయితే చాలు… కొంతమందికి ఎక్కడా తెలియని శునకానందం బయలుదేరుతుంది. దాంతో ఇష్టం వచ్చినట్టు వార్తలు రాసి పారేస్తారు.

ఇపుడు కొత్తగా ఈ తాజా వార్త. అపుడెపుడో జరిగిన విషయం పట్టుకొని నేటికీ శ్రీజను ట్రోల్ చేసే మేధావులు ఇక్కడ చాలామంది వున్నారు. ఆమధ్య వీరు విడిపోయినట్టు ధృవీకరించిన ఈ పెద్దలే నేడు విడిపోలేదు… కూతురు బాగోగులకోసం అలోచించి వారు కలిసి బతకడానికి ఓ నిర్ణయానికి వచ్చారని చెబుతున్నారు. అయితే మెగా ఫామిలీ గాని, కళ్యాణ్ దేవ్ ఫామిలీ గాని ఎక్కడా వారి విషయమై అధికారికంగా మాట్లాడింది లేదు. మరి ఇలాంటి వార్తలు ఎలా పుడతాయో తెలియదని ఈ సందర్భంగా వారు చెప్పుకొస్తున్నారు.

ఇకపోతే ఆమధ్య ఫ్యామిలీ గేధరింగ్ లో కళ్యాణ్ దేవ్ కనబడకపోవడం వల్లనే ఇలాంటి వార్తలకు బలం చేకూరిందని కొందరు కుహనా మేధావులు అంటున్నారు. అయితే సినిమా షూటింగ్స్ లో కాస్త బిజీ అయినటువంటి కళ్యాణ్ దేవ్ ఇలాంటి మీటింగ్స్ కి హాజరు కాని పరిస్థితి. కూతురు నవిష్క, శ్రీజ ఇద్దరే కనబడుతూ వున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం వలన కూడా ఇటువంటి సమస్యలు వచ్చాయి. అయితే జనాలు కోసం వారు బతకరు కదా. ఇక్కడ ప్రతి ఒక్కరికీ పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది. కాబట్టి ఎదుటివారి వైపు వేలెత్తి చూపే ముందు మన బతుకులేమిటో చూసుకోవాలని నెటిజన్లు ఆయా వార్తలను రాస్తున్నవారిపై దుమ్మెత్తిపోస్తున్నారు.