బాలయ్య సినిమా కోసం శ్రీలీల ఇంత హ‌డావిడి చేస్తోందా…!

ప్రస్తుతం టాలీవుడ్ హీరోలకు హాట్ ఫేవరెట్ గా మారిన ముద్దుగుమ్మ శ్రీ లీల. మహేష్ బాబు నుంచి బాలయ్య వరకు అందరితో సినిమాలు చేస్తుంది. బాలయ్య అనిల్ రావిపూడి కాంబోలో NBK108లో బాల‌య్య‌కు కూతురుగా ఓ ప్రత్యేక పాత్రలో నటిస్తుంది. అయితే ఇప్పుడు ఈ సినిమా నుంచి ఓ అదిరిపోయే అప్డేట్ వైరల్ గా మారింది. అది ఏమిటంటే ఈ మూవీ కోసం ఓ మంచి మాస్ సాంగ్ షూటింగ్‌ ఈరోజు నుంచి రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభిస్తున్నారట.

NBK 108 : 5 Cr For Srileela's Song

ఈ పాట కోసం ప్రత్యేకంగా ముంబై నుంచి డాన్సర్లను తీసుకొస్తున్నారట. అలాగే లోకల్ జూనియర్ ఆర్టిస్టులు ఇలా వందలాది మందితో ఈ ఊర మాస్ సాంగ్ తెరకెక్కించబోతున్నారు. ప్రత్యేకంగా ఈ పాట కోసమే నాలుగు నుంచి ఐదు రోజులపాటు షూటింగ్ జరగనుంది. ఈ సినిమాలో ఓ ఉత్సవం సందర్భంగా ఈ మాంచి మాస్ బీట్ వస్తుందని తెలుస్తోంది. థమన్ ఇచ్చిన ఓ మాస్ ట్యూన్ తో ఈ పాట సాగుతుంది.

ఈ ఒక్క పాట కోసం అయిదు కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. అరేంజ్ మెంట్స్, కెమేరాలు, లైటింగ్, క్రేన్ ల దగ్గర నుంచి ముంబాయి డ్యాన్సర్లు , వాళ్ల ఫ్లయిట్ టికెట్ లు, అకామిడేషన్, ఫిలిం సిటీ ఫీజులు ఇలా సమస్త ఖర్చులు కలిపి అయిదు కోట్లు దాటేస్తుందట. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ నటిస్తోంది. శ్రీలీల పాత్ర ఏమిటి అన్నది మాత్రం సస్పెన్స్ గా వుంచారు. దసరాకు విడుదలవుతున్న ఈ సినిమాకు నిర్మాత సాహు గారపాటి.