షాకింగ్: రెండు పెళ్లిళ్లు చేసుకున్న స్టార్ హీరోతో రమ్యకృష్ణ ప్రేమాయణం నడిపిందా..?

సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 80-90వ దశకంలో అగ్ర హీరోయిన్‌గా తెలుగు చిత్ర సీమను ఒక ఊపు ఊపింది. రమ్యకృష్ణ భలే మిత్రులు అనే సినిమాతో తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్‌గా తన కెరీర్‌ను మొదలు పెట్టింది. తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తన అందం, అభినయంతో భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఎలాంటి క్యారెక్టర్ అయినా అలవోకగా పోషించే అతికొద్ది హీరోయిన్లలో ఒకరిగా తన స్థానాన్ని సంపాదించుకుంది.

Ramya Krishnan Birthday: Fans bombard social media as they shower love on  Baahubali actress | Trending News – India TV

రజినీకాంత్ హీరోగా వచ్చిన నరసింహ సినిమాలో లేడీ విలన్‌గా తన నట విశ్వరూపం చూపించింది. ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఫుల్ బిజీగా కొనసాగుతుంది. ఇటీవీలే తన భర్త దర్శకత్వంలో వచ్చిన `రంగ‌మార్తాండ‌`సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఈ సినిమాతో మరోసారి తన నటనతో ప్రేక్షకుల మనసు దోచేసింది రమ్యకృష్ణ.

Nagarjuna And Ramya Krishnan Special Diwali Wishes | Bangarraju | Naga  Chaitanya | Daily Culture - YouTube

రమ్యకృష్ణ సినిమాల విషయం పక్కన పడితే.. గతంలో రమ్యకృష్ణ గురించి ఓ రూమర్ బాగా వైరల్ గా మారింది. రెండు పెళ్లిళ్లు చేసుకున్నా ఓ స్టార్ హీరోతో ఈమె ప్రేమలో పడిందని పెద్ద ఎత్తున వార్తలు కూడా వచ్చాయి. ఇంతకీ ఆ హీరో మరి ఎవరో కాదు..అక్కినేని అందగాడు నాగార్జున. ఈ ఇద్దరి కాంబినేషన్లో ఇప్పటివరకు 10కి గా సినిమాలు వచ్చాయి. వాటిలో ఎక్కువ శాతం సూపర్ హిట్స్ ఏ ఉన్నాయి. పైగా వీరీ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.

krishna vamsi comments on ramya krishnan

ఇలా ఈ ఇద్దరు వరుసగా కలిసి సినిమాలు చేయడంతో.. రమ్యకృష్ణ- నాగార్జున మద్య ఏదో స‌మ్‌థింగ్ స‌మ్‌థింగ్ అంటూ ప్రచారం మొదలైంది. అప్ప‌టికే నాగార్జున తన మొదటి భార్య లక్ష్మికి విడాకులుు ఇచ్చి అమలను రెండో వివాహం చేసుకున్నాడు. అదే సమయంలో రమ్యకృష్ణ ఎంట్రీ తో.. నాగార్జున అమలకి కూడా విడాకులు ఇవ్వబోతున్నాడు అంటూ అప్పట్లో ఓ వార్త వైరల్ గా మారింది. నాగార్జున ర‌మ్య‌కృష్ణను మూడో వివాహం చేసుకుంటాడ‌ని కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే రమ్యకృష్ణ 2003 లో ప్రముఖ దర్శకుడు కృష్ణ వంశీ ని పెళ్లాడడం తో.. నాగార్జున‌తో ల‌వ్ ఎఫైర్ అంటూ వ‌చ్చిన వార్త‌ల‌కు పులిస్టాప్ ప‌డింది.