జీవితంలో ఎదురయ్యే దరిద్రాలను ఎలా ఎదుర్కొంటావ్‌.. నెటిజన్ ప్రశ్నకు సమంత స్ట్రాంగ్ రిప్లై..!

ప్రముఖ నటి సమంతా రూత్ ప్రభు గత కొద్ది రోజులుగా జీవితంలో చాలా సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే జీవితంలో అడ్డంకులు, దరిద్రాలు ఎలా ఎదుర్కొంటున్నావని ఒక అభిమాని ప్రశ్నించాడు. దానికి సమంత అదిరిపోయే రిప్లై ఇచ్చింది. సామ్‌ తన భర్త నుంచి ఇటీవల విడిపోవడం నుంచి మయోసిటిస్ బారిన పడడం వరకు చాలానే సవాళ్లను ఎదుర్కొంది. ఒకానొక సమయంలో తన బాధలను చెప్పుకుని ఏడ్చేసింది. తర్వాత అన్ని సమస్యలను అధిగమించే తన జీవితాన్ని గొప్పగా సాగిస్తోంది.

తాజాగా నెటిజన్ అడిగిన ప్రశ్నకు కూడా ఆమె అదేవిధంగా సమాధానం చెప్పింది. అడ్డంకులను ఎలా ఎదుర్కొంటున్నావు అని అడిగిన ప్రశ్నకు ఆమె “ఎందుకంటే నా కథ ఇలా ముగియడం నాకు ఇష్టం లేదు.. నేనే నా జీవితాన్ని డిసైడ్ చేసుకుంటాను’’ అని రెస్పాన్స్ ఇచ్చింది. ఆమె తన జీవితాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవాలని, నెగిటివ్ ఆలోచనలు, ప్రభావాలు తన జీవితాన్ని డిసైడ్ చేయకూడదని బలంగా నిర్ణయించుకున్నట్లు ఈ రిప్లై చూస్తే అర్థమవుతుంది.

సమంత ఎప్పుడూ తన జీవితంలో జరిగిన ముఖ్యమైన సంఘటనల గురించి, మంచి లేదా చెడు గురించి తన అభిమానులతో నిజాయితీగా ఉంటుంది. ఆమె నాగ చైతన్యను వివాహం చేసుకున్న నాలుగేళ్ల తర్వాత 2021లో విడిపోతున్నట్లు ప్రకటించింది. తర్వాత అతను జబ్బు గురించి కూడా ఆమె బహిరంగంగా వెల్లడించింది.

ఇకపోతే గుణశేఖర్ దర్శకత్వంలో కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన శాకుంతలంలో సమంత కథానాయికగా నటిస్తోంది. ఈ సినిమాలో దేవ్ మోహన్ రాజు దుష్యంత పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఏప్రిల్ 14న రిలీజ్ కానుండగా సమంత ప్రమోషన్లను ముమ్మరం చేసింది. షాకుంతలం గురించి అభిమానులకు తెలియని ఐదు విషయాలను ఒక వీడియో రూపంలో కూడా తెలియజేసింది. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దాన్ని మీరు కూడా చూసేయండి.

 

 

View this post on Instagram

 

A post shared by Samantha (@samantharuthprabhuoffl)