మిల్కీ బ్యూటీ ని తన ప్రియుడు ముద్దుగా ఏమని పిలుస్తారో తెలుసా.. మరి అంత రొమాంటికా..!

మిల్కీ బ్యూటీ తమన్న శ్రీ సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతో అనుకున్నంత విజ‌యం అందుకోలేకపోయినా తర్వాత హ్యాపీ డేస్ సినిమాతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఈ సినిమా తర్వాత నుంచి తమన్నా టాలీవుడ్‌లో ఉన్న అగ్ర హీరోలతో నటించి స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తమన్నా తెలుగులోనే కాకుండా కోలీవుడ్ లో కూడా సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా మారింది.

ప్రస్తుతం బాలీవుడ్ లో వర‌స‌ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తమన్నా చిత్ర పరిశ్రమకు పరిచయమై దాదాపు 17 సంవత్సరాలు అవుతున్నప్పటికీ వరుస అవకాశాలు అందుకుంటూ చిత్ర పరిశ్రమలో కొనసాగుతుంది. హీరోయిన్‌గా ఎంతో బిజీగా కొనసాగుతున్న తమన్నా గత కొంతకాలంగా తన వ్యక్తిగత విషయాలతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతుంది. తమన్న బాలీవుడ్ నటుడు విజయ్ వర్మను ప్రేమిస్తున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.

Vijay Varma's Comment Goes Viral On Tamannaah Bhatia's Photo In Red Lehenga  With Sexy Bra

ఆ వార్తల నిజం అనుకునేలా వీరిద్దరూ కలిసి తిరగటం, రెస్టారెంట్లకు వెళ్ళటం, ఫంక్షన్లకు హాజరు కావడంతో వీరు నిజంగా డేటింగ్ లో ఉన్నారని అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పడం లేదని సినీ విశ్లేషకులు అంటున్నారు.త్వరలోనే తమన్న తన ప్రేమ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తుందని బాలీవుడ్ మీడియాలో ఓ వార్త వైరల్ గా మారింది.

Tamannaah Bhatia spotted with Vijay Varma at award event, netizens  displeased; watch

ఇదిలా ఉండగా తమన్నా ప్రియుడు విజయ వర్మ మిల్కీ బ్యూటీ ని ముద్దుగా ఓ పేరుతో పిలుస్తారట. విజయ్.. తమన్నాను పిలిచే ఆ ముద్దు పేరు ఏంటి అనే విషయానికొస్తే తమన్నాను ”తమటార్” అంటూ విజయ్ ముద్దుగా పిలుస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం తమన్నా ముద్దు పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Share post:

Latest