దారుణంగా ప‌డిపోయిన `ఏజెంట్‌` క‌లెక్ష‌న్స్‌.. 2వ రోజు ఎంత వ‌చ్చాయో తెలిస్తే షాకే!

భారీ అంచ‌నాల న‌డుమ ఈ శుక్ర‌వారం విడుద‌లైన స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ `ఏజెంట‌`. అక్కినేని అఖిల్ హీరోగా సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా బ్యానర్‌లపై హై బ‌డ్జెట్ తో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించారు. ఇందులో మోడ‌ల్ సాక్షి వైద్య హీరోయిన్ గా న‌టించింది.

మ‌ల‌యాళ స్టార్ మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషించారు. మొద‌టి ఆట నుంచే డిజాస్ట‌ర్ టాక్ ను మూట‌గ‌ట్టుకుంది. అయితే ఏప్రిల్ 28న గ్రాండ్ రిలీజ్ అయిన ఈ చిత్రం ప్రేక్ష‌కుల‌నే కాదు అక్కినేని అభిమానుల‌ను కూడా మెప్పించ‌లేక‌పోయింది. డిజాస్ట‌ర్ టాక్ ను మూట‌గ‌ట్టుకుని బాక్సాఫీస్ వ‌ద్ద ఓ మోస్త‌రు ఓపెనింగ్స్ ను రాబ‌ట్టింది.

ఇక రెండో రోజుకు ఏజెంట్ క‌లెక్ష‌న్స్ దారుణంగా ప‌డిపోయాయి. తొలి తెలుగు రాష్ట్రాల్లో రూ. 4.00 కోట్ల రేంజ్ లో షేర్ ను వ‌సూల్ చేసిన ఏజెంట్.. 2వ రోజు రూ. 67 లక్షలు మాత్ర‌మే రాబ‌ట్టింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 81 ల‌క్ష‌ల‌ షేర్ తో స‌రిపెట్టుకుంది. ఏరియాల వారీగా ఏజెంట్ 2 డేస్‌ టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ను ఓసారి గ‌మ‌నిస్తే..

నైజాం: 1.54 కోట్లు
సీడెడ్: 72 ల‌క్ష‌లు
ఉత్త‌రాంధ్ర‌: 65 ల‌క్ష‌లు
తూర్పు: 36 ల‌క్ష‌లు
పశ్చిమ: 35 ల‌క్ష‌లు
గుంటూరు: 59 ల‌క్ష‌లు
కృష్ణ: 27 ల‌క్ష‌లు
నెల్లూరు: 19 ల‌క్ష‌లు
——————————————–
ఏపీ+తెలంగాణ‌= 4.67 కోట్లు(7.90 కోట్లు~ గ్రాస్‌)
——————————————–

క‌ర్ణాట‌క‌+రెస్టాప్ ఇండియా: 0.34 కోట్లు
ఓవ‌ర్సీస్‌: 0.75 కోట్లు
———————————————–
టోటల్ వరల్డ్ వైడ్ = 5.76 కోట్లు(10.25 కోట్లు~ గ్రాస్)
———————————————–

కాగా, రూ. 37 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఏజెంట్.. బాక్సాఫీస్ వ‌ద్ద క్లీన్ హిట్ గా నిల‌వాలంటే మొద‌టి రెండు రోజులు వ‌చ్చిన వ‌సూళ్లు కాకుండా ఇంకా రూ. 31.24 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకోవాల్సి ఉంటుంది.