ఉపాసన కోసం ఎన్టీఆర్ వైఫ్ చేసిన పని తెలిస్తే.. అందరూ ఆశ్చర్య పోవాల్సిందే..!

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్టీఆర్- రామ్ చరణ్ ఎంత మంచి స్నేహితులో మనకు తెలిసిందే. ఇలా వీరి మధ్య ఎంత మంచి రిలేషన్ ఉందో వారి భార్యలు లక్ష్మీ ప్రతీ, ఉపాసన మధ్య కూడా అంతే మంచి రిలేషన్ ఉందట. ఆ రిలేషన్ కారణంగానే తరచూ వీరిద్దరూ ఒకరికొకరు గిఫ్ట్‌లు ఇచ్చి పుచ్చుకోవడం వంటివి చేస్తూ ఉంటారు. అయితే ఈ ఇద్దరు కలిసి ఎప్పుడు సోషల్ మీడియాలో కనిపించకపోయినా వ్యక్తిగతంగా తరచు కలుస్తూ పార్టీలు చేసుకుంటూ ఉంటారట. లక్ష్మీపతి- ఉపాసన మధ్య ఎంతో మంచి స్నేహం ఉందని చెప్పాలి.

Friendship Between Mega and Nandamuri families Revealied ఎన్టీఆర్, చరణ్-  ప్రణతి, ఉప్సీ.. ఫ్రేమ్ అదిరింది

ఇకపోతే ఉపాసన ప్రస్తుతం గర్భవతి అనే విషయం మనకు తెలిసిందే. ప్రెగ్నెన్సీ అనే విషయాన్ని ప్రకటించినప్పటి నుంచి ఎప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే వస్తుంది. ప్రెగ్నెన్సీని ప్రకటించినప్పటి నుంచి ఉపాస‌న‌కు సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా భారీగా పెరిగిపోయింది. ఉపాసన స్నేహితులు తనకు నిర్వహించిన బేబీ షవర్ వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఉపాసన ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు.

అయితే ఇప్పుడు ప్రస్తుతం గర్భవతిగా ఉన్న ఉపాసన కోసం ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి ఎవరు ఊహించని ఓ సర్ప్రైజ్ గిఫ్ట్‌ను పంపారట. ఆ గిఫ్ట్ ఏమిటంటే లక్ష్మీ ప్రణతి, ఉపాసన కోసం డ్రై ఫ్రూట్స్ లడ్డూలు, సున్నుండలు వంటి ఎన్నో రకాల పిండి వంటలు స్వయంగా తయారు చేసి ఆమె కోసం పంపించారని తెలుస్తుంది.

గ‌ర్భవతిగా ఉన్న ఉపాసన ఎలాంటి ఆహారం తింటుందో తెలుసుకుని అలాగే ఆ పిండి వంటలు కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఎంతో ఆరోగ్యం కావడంతో ఆమె స్వయంగా ఎన్నో రకాల పిండి వంటలను తయారు చేసి ఉపాసన కోసం పంపించారట. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో వారి మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో అర్థమవుతుంది. ఇలా ప్రణతి ప్రేమగా ఉపాసనకు స్వీట్స్ పంపించారని తెలిసి ఎన్టీఆర్- రామ్ చరణ్ ఇద్దరూ ఒక్కసారిగా షాక్ అయ్యారని తెలుస్తుంది. ఇక ఈ విషయం తెలిసి మెగా- నందమూరి అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Share post:

Latest